Home Entertainment టాలీవుడ్లో టాప్ ప్లేస్ ఎవ‌రిది?

టాలీవుడ్లో టాప్ ప్లేస్ ఎవ‌రిది?

174
0

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ ఫిమేల్ కేటగిరీలో సమంత మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా జాను అనే సినిమాలో కనిపించిన ఆమె ప్రస్తుతం ఒక తమిళ, ఒక తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2 కొద్ది రోజుల క్రితమే రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ఇక కాజల్ అగర్వాల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా మోసగాళ్లు అనే తెలుగు సినిమాలో కనిపించిన ఈ భామ ప్రస్తుతం నాలుగైదు తమిళ సినిమాలు చేస్తూ ఉండగా, తెలుగులో ఆచార్య అనే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తోంది.

పూజా హెగ్డే అయితే ప్రస్తుతానికి సినిమాలకి గ్యాప్ ఇచ్చిన అనుష్క ఈ జాబితాలో కూడా మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో కనిపించిన అనుష్క ఇప్పటికీ మరో సినిమాని అనౌన్స్ చేయలేదు. ఇక బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గత లిస్టులో ఆమె ఐదవ స్థానం సంపాదించింది. ఇక చివరిగా అల వైకుంఠ పురంలో సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమా చేస్తోంది. అలానే అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా చేస్తోంది.

తమన్నా ఇక గీత గోవిందం భామ రష్మిక మందన్న ఈ జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకింది. గతంలో ఆమె ఆరో స్థానం సంపాదించింది. ఇక ఆమె చివరిగా సుల్తాన్ అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో నటిస్తోంది. అలాగే రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకింది. గతంలో ఆమె ఏడో స్థానం సంపాదించింది. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం సిటీ మార్ అనే సినిమాలో నటించింది. అలాగే తెలుగులో ఎఫ్ త్రీ, గుర్తుందా శీతాకాలం మాస్ట్రో సినిమాల్లో కూడా ఆమె నటిస్తోంది.

అయితే కీర్తిసురేష్ ఈ జాబితాలో ఏడో స్థానానికి దిగజారింది. నిజానికి ఆమె గతంలో నాలుగో స్థానంతో ఉండగా ఇపుడు ఏడోస్థానానికి వెళ్ళింది. ఇక ఈ ఏడాది రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. హీరోయిన్ సాయి పల్లవి ఎనిమిదో స్థానా స్థానాన్ని నిలబెట్టుకుంది. చివరిగా ఎన్జీకే అనే తమిళ సినిమాతో సూర్య భార్యగా నటించిన సాయి పల్లవి ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాతో, విరాటపర్వం సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడ్డాయి. మరో పక్క ఆమె శ్యామ్ సింగారాయ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

రాశి ఖన్నా రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. గతంలో ఆమె పదో స్థానం సంపాదించింది. చివరిగా చెక్ సినిమాలో మానస పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండపొలం అనే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. రాశి ఖన్నా ఈ జాబితాలో పదో స్థానానికి దిగజారింది. అంతకు ముందు ఆమె తొమ్మిదో స్థానంలో ఉండేది. ఇక చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఖన్నా ప్రస్తుతానికి పక్కా కమర్షియల్ అలాగే థాంక్యూ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here