అంజలికి పట్టుదల ఎక్కువే!

  164
  0

  ఏ సినిమాకైనా కథనే ప్రధానం .. కథ బాగున్నప్పుడు ఆ హీరో క్రేజ్ ఆ సినిమాకి హెల్ప్ అవుతుంది. అలాగే హీరోయిన్ గ్లామర్ అదనపు ఆకర్షణ అవుతుంది. కథాకథనాలు .. హీరోల సంగతి అటుంచితే హీరోయిన్ చాలా గ్లామరస్ గా ఉండాలి .. తన ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేయాలి. థియేటర్ కి వచ్చిన తరువాత ఆమె అభినయం ఎలా ఉందన్నది చూస్తారు. కానీ వాళ్లను థియేటర్ వరకూ తీసుకొచ్చేది ఆమె గ్లామరే.

  అయితే తెలుగు తెరపై మొదటి నుంచి కూడా గ్లామర్ పరంగా మార్కులు కొట్టేసేది ముంబై ముద్దుగుమ్మలు .. కేరళ కొబ్బరి ముక్కలాంటి అమ్మాయిలు. ఈ కారణంగా వాళ్ల హవానే చాలా కాలంగా సాగుతూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో తెలుగు అమ్మాయిలను పట్టించుకునే అవకాశం ఉండేది కాదు. అందువల్లనే అంజలి రచ్చ గెలిచి ఇంట గెలవాలనే ఉద్దేశంతో ముందుగా తమిళ సినిమాలపై దృష్టిపెట్టింది. అక్కడి అనువాదాల ద్వారా తెలుగులో అవకాశాలు అందుకుని ఇక్కడ అడుగుపెట్టింది.

  ఎలాంటి పాత్రలోనైనా అంజలి అవలీలగా ఒదిగిపోతుంది. చాలా సహజంగా ఆ పాత్రలో ఇమిడిపోతుంది. అందువల్లనే చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ క్రేజ్ ను సొంతం చేసుకుంది. యువ కథానాయకులతో పాటు సీనియర్ స్టార్ హీరోలతో సైతం నటించి మెప్పించింది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ కథలను చేస్తూ వెళ్లింది. అలాంటి అంజలి ప్రస్తుతం తెలుగు .. తమిళ భాషల్లో కొత్త హీరోయిన్ల నుంచి గట్టిపోటీని ఎదుర్కుంటోంది. ఎలాగైనా పోటీని తట్టుకోవాలనే తపనతో సన్నబడింది. అవకాశాలను అందుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాను అనుకున్న స్థాయికి చేరుకోవాలనే ఆశిద్దాం.     

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here