Home Entertainment వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర

వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర

75
0

వరుసగా మూడో సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్‌కు మంచి చేసే కార్యక్రమమిది. సొంత వాహనం కలిగి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లగా ప్రతిరోజూ సేవలందిస్తూ, రోజూ లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్ధానాలకు చేరుస్తున్నారు. అలాంటి అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరికీ కూడా  3,648 కిలోమీటర్ల సాగిన నా పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో మే 14, 2018న ఒక మాటిచ్చాను.

ఆ రోజు వాళ్లు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వంలో బాదుడు ఎక్కువ అయింది, ఫెనాల్టీలు ఎక్కువ ఉన్నాయని మొరపెట్టుకున్నారు. ఫెనాల్టీలు కట్టకపోతే ఆటో తిరగదని, రోజుకు రూ.50 ఫెనాల్టీ వేస్తున్నారని ఆవేదన చెందారు. ఇన్సూరెన్స్‌ కట్టాలంటే దాదాపు రూ.7500 అవుతుందని చెప్పారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ రావాలి, అది కావాలంటే రిఫేర్లు చేయించాలి. అన్నీ కలిపి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతుందని, ఒకేసారి కట్టాలంటే అప్పులు తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పారు. వారి బాధలు విన్న తర్వాత ఆ రోజు ఏలూరు సభలో మాటిచ్చాను.

ఈ కార్యక్రమం ద్వారా రూ. 10 వేల రూపాయలు ఆటో అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల చేతిలో పెడతున్నామో ఇది వాళ్లకు మాత్రమే మేలు చేస్తున్నాము అని అనుకోకూడదు. ఈ కార్యక్రమం ద్వారా వాహనంలో ప్రయాణించే వారి భద్రతకు కూడా ఈ సొమ్ము భరోసాగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాహనాలకు వాహన బీమా, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌తో పాటు రిపేర్లు తదితర అవసరాల కోసం ఈ డబ్బులు ఇస్తున్నాం. దీనివల్ల ఇన్సూరెన్స్‌ చేయించుకుంటారు. బళ్లు రిపేరు చేయించుకుంటారు, ఫిటినెస్‌ సర్టిఫికేట్‌ కూడా పొందుతారు. ఇవన్నీ కూడా అందుబాటులో వస్తే ఆటోలు నడిపే అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకే కాకుండా ఆటోలో ప్రయాణించే ప్రయాణికులకు ఎంతో మంచి జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here