ప్రియమణి గురించి తెలుగు ఆడియన్స్‌కు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు నుంచి మొదలు పెట్టి హిందీ వరకు అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులను కూడా ఈమె అలరించింది. ముఖ్యంగా ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ ప్రియమణికి క్రేజ్ పెరిగింది.
ఈమెకు అక్కడ కూడా అభిమానులున్నారు. దాంతో పాటు సినిమాలు కూడా చేస్తూనే ఉంది. పెళ్లి తర్వాత కూడా ప్రియమణి జోరు తగ్గడం లేదు. వరసగా కమిట్మెంట్స్ ఇస్తూనే ఉంది. ఈమె తెలుగులో ప్రస్తుతం వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్పతో పాటు మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్యే ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి ఓపెన్ అయింది ప్రియమణి. ముఖ్యంగా తనను చాలా మంది దారుణంగా ట్రోల్ చేసారని.. ఇలా ఉన్నావేంటి నువ్వు హీరోయిన్‌వా అంటూ ఏడిపించారని గుర్తు చేసుకుంది.
సోషల్ మీడియాలో తనపై వచ్చే కామెంట్స్ చూసినపుడు కొన్నిసార్లు ఒళ్ళు మండిపోయేదని చెప్పుకొచ్చింది ప్రియమణి. ఇంత లావుగా ఉన్నావేంటి.. పందిలా ఉన్నావ్ అంటూ కొందరు కామెంట్ చేసారని తెలిపింది.
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సుచిత్ర తివారి పాత్రలో ఈమె బాగా సెట్ అయింది. ఈ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. ఏదేమైనా కూడా బాడీ షేమింగ్ అనేది సరైంది కాదని.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అలా అనడం తప్పే అంటుంది ఈ ముద్దుగుమ్మ.