Home Entertainment మీట్ క్యూట్ అంటూ నాని కొత్త ప్రాజెక్ట్‌

మీట్ క్యూట్ అంటూ నాని కొత్త ప్రాజెక్ట్‌

164
0

నాని హీరోగానే కాకుండా నిర్మాతగానూ దుమ్ములేపుతున్నారు. నిర్మించిన ప్రతీ సినిమా అవార్డుల పంటను పండిస్తోంది. అలా మొట్టమొదటిసారిగా అ! సినిమాను నిర్మించారు. మొదటి చిత్రంతోనే జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. అలా నిర్మాతగా నాని తన అభిరుచిని అందరూ ఆదరిస్తున్నారు. కలెక్షన్ల పరంగా సినిమాలు కాస్త తేడా కొట్టినా కూడా విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంటున్నాయి. అయితే తాజాగా నాని తన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

వాల్ పోస్టర్ ప్రొడక్షన్ పేరు మీదుగా నాని నిర్మిస్తున్న సినిమాలు ఎంతటి ఆదరణను దక్కించుకుంటున్నాయో అందరికీ తెలిసిందే. అ!, హిట్‌ వంటి సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఓ వైపు హీరోగానూ ఎంతో పాపులర్ అయిన నాని.. నిర్మాతగానూ అన అభిరుచిని చాటుకుంటున్నారు. ఇప్పుడు నాని టక్ జగదీశ్, శ్యాం సింఘరాయ్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే టక్ జగదీశ్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది.

ఇక హీరోగా తన ప్రాజెక్ట్‌లు పూర్తి చేస్తూనే నిర్మాతగానూ మంచి చిత్రాలను తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో నిర్మాతగా తన కొత్త ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చారు. మీట్ క్యూట్ అంటూ రాబోతోన్న ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈక్రమంలో నాని ట్వీట్ వేశారు. కొత్త జర్నీ ప్రారంభమైంది.. ఇదెంతోప్రత్యేకమైంది.. దీనికి అనేక కారణాలున్నాయంటూ వివ‌రించారు నాని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here