Home Entertainment బ‌న్నీకి రాజ‌మౌళి అక్క‌ర్లేదా..?

బ‌న్నీకి రాజ‌మౌళి అక్క‌ర్లేదా..?

162
0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో ఈ ముగ్గురు ఉన్నారు. అలానే నేషనల్ వైడ్ అటెన్షన్ తెచ్చుకున్న తెలుగు హీరోలు కూడా. అయితే వీరంతా జక్కన్న తయారు చేసిన స్టార్స్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలతోనే వీరికి ఈ స్థాయి క్రేజ్ వచ్చిందని సినీ అభిమానులు అంటుంటారు.

ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ హిట్ ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. ఆ తరువాత వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహాద్రి’ ‘యమదొంగ’ సినిమాలు మంచి విజయాలు నమోదు చేశాయి. ఇప్పుడు నాల్గవ సారి పాన్ ఇండియా మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ తో వస్తున్నారు. అలానే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘ఛత్రపతి’ సినిమా అతన్ని టాలీవుడ్ స్టార్ హీరోల సరసన చేర్చింది. ఈ క్రమంలో వీరి కాంబోలో వచ్చిన ‘బాహుబలి’ 1 & 2 చిత్రాలు డార్లింగ్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసేశాయి.

ఇక రామ్ చరణ్ తో రాజమౌళి చేసిన ‘మగధీర’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయడమే కాకుండా.. చెర్రీ కి రెండో సినిమాతో స్టార్ డమ్ వచ్చేలా చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరూ కలిసి చేస్తున్న ‘RRR’ సినిమాతో చరణ్ కు పాన్ ఇండియా ఇమేజ్ రానుంది. అయితే జక్కన్న లేకపోతే ప్రభాస్ – ఎన్టీఆర్ – చరణ్ లకు ఇంత స్టార్ డమ్ లేదనేది సినీ అభిమానుల్లో ఎప్పుడూ ఉండే డిస్కషన్. కానీ రాజమౌళి తో సినిమా చేయకుండా.. ఇతర స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసుకుంటూ నేషనల్ అటెన్షన్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్.

ఈ ముగ్గురు హీరోలు కూడా జక్కన్న తో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే.. బన్నీ మాత్రం ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం సుకుమార్ ను ఎంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా తెలుగుతో పాటుగా పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే నార్త్ ఆడియన్స్ దృష్టిలో పడిన అల్లు అర్జున్.. ‘పుష్ప’ సినిమా హిట్ బాలీవుడ్ హీరోలకి పక్కలో బల్లెంగా మారతాడు అనడంలో సందేహం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here