Home Entertainment పెళ్ళిరోజున వైర‌ల్‌గా మారిన ఉపాన‌స కామెంట్స్‌

పెళ్ళిరోజున వైర‌ల్‌గా మారిన ఉపాన‌స కామెంట్స్‌

155
0

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్‌ రామ్ చరణ్‌‌కు ఈ రోజు (జూన్ 14) ఓ స్పెషల్ డే. 2012 సంవత్సరం సరిగ్గా ఇదే రోజు తన బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్ పెట్టేసి వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టారు రామ్ చరణ్. తన ఇష్ట సఖి ఉపాసనను పెళ్లాడి ఆమెకు మెగా కోడలిగా ప్రమోషన్ ఇచ్చారు. అంటే నేడు ఈ స్వీట్ కపుల్ 9వ పెళ్లి రోజు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున తన భర్త రామ్ చరణ్‌కి చీర్స్ చెబుతూ మెగా అభిమానులకు కిక్కిచ్చే పోస్ట్ పెట్టింది.

యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా సత్తా చాటుతూ అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఉపాసన.. నిత్యం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి చేత భేష్ అనిపించుకుంటోంది. సినీ నటి కాకపోయినా తనదైన దారిలో వెళుతూ భారీ ఫాలోయింగ్ కూడగట్టుకొని మెగా కోడలిగా పలువురి మన్ననలు పొందుతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు మెగా అభిమానులతో, తన ఫాలోవర్స్‌తో టచ్‌లో ఉండటం ఉపాసన నైజం. ఈ నేపథ్యంలోనే తమ పెళ్లి రోజు సందర్భంగా రామ్ చరణ్‌తో దిగిన ఓ క్యూట్ పిక్ షేర్ చేస్తూ తన జర్నీ గురించి ఆసక్తికరంగా సందేశమిచ్చింది.

ఈ రిలేషన్‌షిప్‌ని ఇంత బలంగా, ప్రకాశవంతంగా ఉంచుకున్నందుకు మన ఇద్దరికీ చీర్స్ అంటూ కిక్కిచ్చే కామెంట్‌తో చెర్రీకి స్వీట్ విషెస్ చెప్పింది ఉపాసన. ఆమె చేసిన ఈ పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే చాలా సందర్భాల్లో ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ, గౌరవం తెలియపర్చిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here