Home Entertainment బాడీ షేమింగ్ కామెంట్స్‌పై దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన న‌టి

బాడీ షేమింగ్ కామెంట్స్‌పై దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన న‌టి

76
0

బంగారం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మీరాచోప్రా చెల్లెలి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. అయితే స్వతహాగా మలయాళ అయిన ఈ భామ ఎక్కువగా మలయాళ, తమిళ సినిమాలు చేసింది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన జీనియస్ సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ భామకు ఆ సినిమా హిట్ కాకపోవడంతో పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు.

ఇక రెండేళ్ల క్రితం నాని హీరోగా క్రికెట్ ఆట నేపథ్యంలో వచ్చిన జెర్సీ సినిమాలో నాని జీవితచరిత్రను రాసి జర్నలిస్ట్ పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఈ మధ్య కాస్త బొద్దుగా తయారవడంతో ఆమె ఫాలోవర్స్ అంతా బరువు గురించి అనేక రకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు.

కొన్నాళ్లపాటు బాగానే భరిస్తూ వచ్చిన ఈ మల్లూ బ్యూటీ ఇక భరించాల్సి అవసరం లేదని చెబుతూ ఫ్రీక్ ఔట్ అయింది. తన బరువు గురించి కామెంట్ చేస్తున్న అందరికీ తన సోషల్ మీడియా వేదికగా ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా వేసింది. “ఓహ్ అవును !! బహుశా నాకన్నా ఎక్కువగా నా బరువు గురించి ప్రస్తావిస్తూ, దాని గురించి చింతిస్తూ & దాని గురించి ఎక్కువగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ, స్వీట్‌హార్ట్, మనం బతికేది ఈ బరువు తగ్గడానికి అలాగే అందంగా కనిపించడానికి మాత్రమే కాదు అని పేర్కొంది.

అంతే కాక మీకు వేరొకరి శరీరం గురించి కామెంట్ చేయడానికి అంత సరదాగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఒకరి ఒక వేలు చూపిస్తూ ఉంటే మిగతా వేళ్ళు మీ వైపు చూపిస్తూ ఉంటాయనే విషయం గుర్తుంచుకోండి. మీరు కూడా అంత పర్ఫెక్ట్ ఏమీ కాదు కదా. మీ గురించి మీరు కేర్ తీసుకోండి ఫిజికల్గా అలాగే మెంటల్గా కూడా అంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here