Home Entertainment మినీ స్కర్ట్ తో రోడ్డెక్కిన బ్యూటీ

మినీ స్కర్ట్ తో రోడ్డెక్కిన బ్యూటీ

9
0

హర్యానాలోని రోహ్తక్ లో జన్మించిన అషిమా నర్వాల్ పెరిగింది మాత్రం ఆస్ట్రేలియాలో. జాట్ కుటుంబానికి చెందిన ఆమె కుటుంబం మొత్తానికి ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీలో నర్సింగ్‌ చేసి, కొంతకాలం అక్కడే పని చేసింది. అయితే ఫ్యాషన్ రంగం మీద ఉన్న మక్కువతో మోడల్ గా మారిన ఈ భామ ఒకే సంవత్సరంలో రెండు వేర్వేరు అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. త‌రువాత సినిమాల్లో త‌ళుక్కున మెరిసింది

హ్యాపీ అంటూ సింబల్ ఉన్న ఒక నల్లటి టాప్ ధరించిన ఈ భామ మినీ స్కర్ట్ తో రోడ్డెక్కి ఫోజులిచ్చింది. మళ్ళీ తెల్లటి టాప్ లో కనిపించిన ఈ భామ ఎంజాయ్ ది జర్నీ అంటూ మరో పోస్ట్ చేసి అందరిలో ఆసక్తిగా రేపుతోంది.

ప్రస్తుతం ఈ భామ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ‘రాజ భీమ’ తమిళ సినిమా చేయగా అది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, ఫ్లైయింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ నిర్మించిన ‘పిట్ట కథలు’లో కూడా ఆమె నటించింది. అందులో ఆమె పాత్రకు గాను మంచి పేరు తెచ్చుకుంది ఈ భామ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here