Home Entertainment ఫ్యామిలీ మ్యాన్‌2 పై భార‌తీరాజా ఫైర్‌

ఫ్యామిలీ మ్యాన్‌2 పై భార‌తీరాజా ఫైర్‌

9
0

అమెజాన్‌ ప్రైమ్ వారిని తమిళ సీనియర్ దర్శకుడు భారతీరాజా హెచ్చరించారు. జూన్ 4 నుండి ‘ది ఫ్యామిలీ మెన్‌-1’ సీక్వెల్‌గా రూపొందిన ‘ది ఫ్యామిలీ మెన్‌-2’ ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సమంత అక్కినేని శ్రీలంకకు చెందిన తమిళ యువతిగా న‌టించింది. మొదటిసారి భారీ యాక్షన్ సన్నీవేశాలలోనూ కనిపిస్తుంది. అయితే, సమంత ‘ది ఫ్యామిలీ మెన్‌-2’లో త‌మిళ యువ‌తిగా నెగెటివ్ రోల్‌ పోషించడంతో త‌మిళ‌నాడు ప్ర‌జ‌లు మండిప‌డున్నారు. ఇప్పటికే ఈ వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయినా స్ట్రీమింగ్ అవుతుండటంతో తాజాగా సీనియర్ దర్శకులు భారతీరాజా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. తమిళ ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రిచేలా ఈ వెబ్‌ సిరీస్ రూపొందించారని, దీనిని విడుదల చేయకూడద‌ని విజ్ఞప్తి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవ‌డం బాధాకరమని ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ను తమిళ ద్రోహులు రూపొందించార‌ని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని భారతీరాజా డిమాండ్ చేశారు. లేదంటే అమెజాన్‌ సంస్థపై పోరాటం చేయడానికైనా సిద్దమని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here