Home Entertainment సినీ కార్మికుల కోసం ఆ 9 మంది నిర్మాత‌లు

సినీ కార్మికుల కోసం ఆ 9 మంది నిర్మాత‌లు

14
0

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ ఐడియాతో ముందుకొచ్చారు. మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ నిర్మాణంలో ప్రొడ్యూసర్ జయేంద్ర పంచపకేషన్ భాగస్వామిగా ఉన్నారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఆంథాలజీ సిరీస్ ఆగస్టు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన వేలాది మంది మిళ సినీ కార్మికులకు ‘నవరస’ నిర్మాతలు మణిరత్నం మరియు జయేంద్ర అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఈ సిరీస్ వల్ల వచ్చే లాభాలను విరాళంగా ఇవ్వనున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి

కాగా ‘నవరస’ ఆంథాలజీ సిరీస్ కోసం ప్రముఖ తమిళ నటీనటులు సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. సూర్య – విజయ్ సేతుపతి – బాబీ సింహా – ప్రకాష్ రాజ్ – బొమ్మరిల్లు సిద్ధార్థ్ – నిత్యా మీనన్ – ఐశ్వర్య రాజేష్ – విక్రాంత్ – గౌతమ్ కార్తీక్ – శ్రీరామ్ – అశోక్ సెల్వన్ వంటి స్టార్స్ ఈ సిరీస్ లో నటిస్తున్నారు. పీసీ శ్రీరామ్ – సంతోష్ శివన్ – మనోజ్ పరమహంస – బాలసుబ్రహ్మనియన్ వంటి సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నారు

ప్రియదర్శన్ – గౌతమ్ మీనన్ – వసంత్ – కార్తీక్ సుబ్బరాజ్ – అరవింద్ స్వామి – హాలితా సమీన్ – కార్తిక్ నరేన్ – బెయోజ్ నంబియార్ – ఆర్.ఆర్ ప్రసాద్ వంటి 9 మంది దర్శకులు ఇందులోని 9 కథలను చెప్పబోతున్నారు. ఏఆర్ రెహమాన్ – డి. ఇమ్మాన్ – జిబ్రాన్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here