Home Entertainment ఫోటోతో క‌న్నీరు పెట్టిస్తున్న సోనాలీ బింద్రే

ఫోటోతో క‌న్నీరు పెట్టిస్తున్న సోనాలీ బింద్రే

141
0

సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్ ను జయించి మళ్లీ సాదారణ జీవితాన్ని సాగిస్తున్న విషయం తెల్సిందే. క్యాన్సర్ బారిన పడ్డ సమయంలో ఆమె మళ్లీ కోలుకుంటుందా లేదా అన్నట్లుగా తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆమె కోసం ఎంతో మంది అభిమానులు ప్రార్థనలు చేశారు. ఆమె ఆరోగ్యం బాగు పడాలంటూ సినీ ప్రముఖులు సైతం కోరుకుంటూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అందరి ప్రార్థనల ఫలంగా ఆమె కోలుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీతో ఆమె జీవనం సాగిస్తుంది. ఈ సమయంలో ఆమె షేర్ చేసిన ఈ ఫొటో అందరి కళ్లలో కన్నీరు పెట్టిస్తుంది.

అమెరికాలోక్యాన్సర్ కు చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫొటోతో రీసెంట్ ఫొటోను షేర్ చేసింది. ఆ సమయంలో సోనాలి పరిస్థితి ఎంత దారణంగా ఉందో ఈ ఫొటోను చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ ఫొటో తో సోనాలి.. కాలం ఎంతగా మారింది. నేను ఈ రోజు వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ సమయంలో నా బలహీనత కనిపిస్తుంది. సి పదం(క్యాన్సర్) తర్వాత నా జీవితం ఎలా ఉందనే విషయాన్ని నిర్వచించకూడదని భావించాను. మీ జీవితాన్ని మీరే ఎంపిక చేసుకోవాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీ జర్నీ కొనసాగుతుందని పోస్ట్ పెట్టింది.

తెలుగు తో పాటు హిందీలో కూడా పలు సినిమాల్లో నటించి సుదీర్ఘ కాలంగా నటించి స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. మహేష్ బాబు మురారితో పాటు చిరంజీవి బాలకృష్ణ ఇంకా పలువురు స్టార్ హీరోలతో నటించిన సోనాలి బింద్రే క్యాన్సర్ ను జయించిన తర్వాత రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాని ఇప్పటి వరకు ఆమె రీ ఎంట్రీ విషయమై ఆసక్తిగా ఉన్నట్లుగా కనిపించడం లేదు ముందు ముందు అత్తగా అమ్మగా ఏమైనా నటించేందుకు ఓకే చెప్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here