Home Entertainment ఓటిటిలో ఉదయ్ కిరణ్ చివరి సినిమా

ఓటిటిలో ఉదయ్ కిరణ్ చివరి సినిమా

138
0

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిత్రం సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు దివంగత నటుడు ఉదయ్ కిరణ్. ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఆ సినిమా అనంతరం ఉదయ్ కిరణ్ నటించిన నువ్వునేను.. మనసంతా నువ్వే.. శ్రీరామ్ లాంటి సినిమాలు హిట్స్ పడటంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే కొన్నేళ్ళకు ఉదయ్ కిరణ్ వరుస ఫ్లాపుల కారణంగా కెరీర్ పరంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఏమైందో తెలియదు కానీ ఇప్పటికి ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని చనిపోయి ఏడేళ్లు దాటింది. అతని మరణం గురించి ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు వినిపించినా వరుస ఫ్లాప్స్ కారణంగానే హీరో సూసైడ్ చేసుకున్నాడని అంతా భావిస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఉదయ్ కిరణ్ టాపిక్ ఎందుకొచ్చింది అంటే.. ఉదయ్ చనిపోయే ముందు చివరగా నటించిన ‘చిత్రం చెప్పిన కథ’ అనే సినిమా ఆ టైంలో థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఉదయ్ చనిపోయాక మేకర్స్ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అయితే అప్పుడు థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమా త్వరలోనే ఓటిటి రిలీజ్ కాబోతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా మదాలస శర్మ నటించింది. ఈ మధ్యకాలంలో ఏ విధంగా సినిమా రిలీజ్ ఆగిపోయినా ఈజీగా ఓటీటీతో డీల్ కుదుర్చుకొని రిలీజ్ చేసేస్తున్నారు మేకర్స్.

తాజాగా ఉదయ్ కిరణ్ సినిమాకు కూడా ఓటిటి ఆఫర్ రావడంతో మేకర్స్ అంగీకరించి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం మేరకు చిత్రం చెప్పిన కథ మూవీ సక్సెస్ అవుతుందని సన్నిహితులతో చెప్పినట్లు టాక్. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో గతం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఎదురైన సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఓటిటి సంస్థలు కూడా సినిమా పై నమ్మకంగా ఉన్నాయట. మరి ఏడేళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here