Home Entertainment బిగ్ బాస్‌లో రియా చ‌క్ర‌వ‌ర్తి ?

బిగ్ బాస్‌లో రియా చ‌క్ర‌వ‌ర్తి ?

126
0

హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతి కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి జైలుకు కూడా వెళ్లి వచ్చిన విషయం తెల్సిందే. సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా తేలడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. జైల్లో కూడా ఆమె కొన్ని రోజులు గడిపింది. సినిమా లతో బిజీగా ఉన్న సమయంలో సుశాంత్ కేసు వల్ల ఆమె ఒక్కసారిగా ఖాళీ అయ్యింది. ఇదే సమయంలో కరోనా వల్ల ఆమెకు ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో ఆమె మళ్లీ హీరోయిన్ గా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే టాలీవుడ్ లో ఆఫర్లు వెదుక్కుంటుందట.. మరో వైపు హిందీ  బిగ్ బాస్ లో కూడా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ తో ఉన్న పరిచయం మరియు ఆమెకు ఉన్న సర్కిల్ ద్వారా బిగ్ బాస్ ఆఫర్ ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 15 కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుంది. ఈ సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 15 ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ సీజన్ ను కాస్త లేట్ గా నే ప్రారంభిస్తారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయినా కూడా ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పక్రియ మొదలు అయ్యిందని సమాచారం అందుతోంది.

సుశాంత్ కేసు నుండి బయట పడేందుకు ఆమెకు బిగ్ బాస్ ఒక మంచి మార్గం అంటున్నారు. ఆమె తనపై ఉన్న అబాండాలను తొలగించుకునేందుకు ఇదొక మంచి మార్గంగా చెబుతున్నారు. అందుకే ఈమె బిగ్ బాస్ సీజన్ 15 లో పాల్గొనాలంటూ బలంగా ప్రయత్నాలు చేస్తుంది. మరో వైపు తెలుగు సినిమా ల్లో కూడా ఈమె ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తుందని సమాచారం. ఈమెతో ఉన్న పరిచయం కారణంగా రానా రియాకు ఆఫర్ ఇప్పించేందుకు ఓకే చెప్పాడని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొత్తానికి రియా చక్రవర్తి మళ్లీ బిజీ అయ్యేందుకు సాధ్యం అయినంతగా ప్రయత్నిస్తూనే ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here