Home Entertainment ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

ఆదిపురుష్ కోసం ప్ర‌భాస్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

142
0

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఇప్పుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయ‌న నేష‌న‌ల్ స్టార్‌గా గుర్తంపు తెచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న ఏ సినిమా చేసినా దాదాపు ఐదు భాష‌ల్లో చేస్తున్నారు. భారీ ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెడుతూ దూసుకుపోతున్నారు. దీంతో ఇప్పుడు ఆయ‌న‌కు భారీ మార్కెట్ ఏర్ప‌డింది. దీన్ని దృష్టిలోపెట్టుకుని నిర్మాత‌లు కూడా ఆయ‌న‌కు స‌పోర్టు చేస్తున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌భాస్ రాధేశ్యామ్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుని, స‌లార్ కోసం రెడీ అవుతున్నాడు. ఇంకోవైపు ఓం రౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ సినిమా కోసం ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు చేస్తున్నారు. ఇక దీని త‌ర్వాత ప్ర‌భాస్ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ రెమ్యున‌రేష‌న్ గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఆయ‌న ఆదిపురుష్‌కు భారీగా రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది.

ఈ సినిమాను ఓం రౌత్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిస్తున్నాడ‌ని స‌మాచారం. అయితే ఈ మూవీని టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తుండ‌గా.. బ‌డ్జెట్ భారీ ఎత్తున పెడుతున్నారంట‌. ఈ సినిమా కోసం నిర్మాణ సంస్థ ఇప్ప‌టికే ప్రభాస్‌కు రూ. 50 కోట్లను పారితోషికంగా ఇవ్వ‌డానికి ఒప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా భారీ ఎత్తున ఉండ‌టంతో పాటు షూటింగ్ కు కాస్త ఎక్కువే స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం పౌరాణిక నేపథ్యంలో వ‌స్తుంది. దీంట్లో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా క‌నిపించ‌నున్నారు.

ఈ మూవీలో మ‌రో పాత్ర అయిన రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ చేస్తున్నాడు. కాగా గతంలో డైరెక్ట‌ర్ ఓం రౌత్‌ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘ఆదిపురుష్ భారతీయ చ‌రిత్ర‌ను తెలియ‌జేస్తుంద‌న్నారు. ప్రభాస్ అయితేనే ఆదిపురుష్ సినిమాకు స‌రిపోతాడ‌ని అందుకే ఆయ‌న్ను సెల‌క్ట్ చేశాన‌ని ఓంరౌత్ వెల్ల‌డించారు. ప్రభాస్‌తో తప్ప ఇంకేవరితో ఈ సినిమా చేయలేన‌ని డైరెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఇక ఈ మూవీ 2022 అగష్టు 11ను ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి వ‌స్తుంద‌ని మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here