Home Asia ఆధ్యాత్మికత వైపు శ్ర‌ద్ధా దాస్‌

ఆధ్యాత్మికత వైపు శ్ర‌ద్ధా దాస్‌

23
0

గుంటూర్ టాకీస్ లో బోల్డ్ అవతార్ లో కనిపించిన శ్రద్ధా దాస్ అప్పట్లోనే తాను బుద్ధిజం స్వీకరించానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని బయటపెట్టేందుకు సోషల్ మీడియాల్లో తెగ తహతహలాడింది.

అందుకు తగ్గట్టే తనకు `ఏక్ మినీ కథ` చిత్రంలో `స్వామి` అనే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని ఇచ్చారు. మిడ్ నైట్ మూడు గంటలకు కలుద్దాం! అంటూ శ్రద్ధా బోల్డ్ అప్పియరెన్స్ ఆకట్టుకుంది. సంతోష్ శోభన్ నటించిన ఈ చిత్రంలో శ్రద్ధా చీరలోనే అందాల్ని ఆరబోసిన తీరు మరోసారి యూత్ కి కనెక్టయ్యింది.

ఏక్ మినీ కథ ఓటీటీలో రిలీజై చక్కని ఆదరణ దక్కించుకుంటోంది. విక్కీ డోనర్- శుభ్ మంగళ్ సావధాన్ తరహాలోనే డిఫరెంట్ లైన్ తో రూపొందిన చిత్రమిదని ప్రశంసలు దక్కించుకుంది. అందుకే హిట్టొచ్చిన వేళ తనని తాను టాలీవుడ్ లో ప్రమోట్ చేసుకునేందుకు శ్రద్ధా బాగానే తపిస్తోంది. తన ఇన్ స్టాలో ఏక్ మినీ కథ ప్రమోషన్ ని పీక్స్ కి చేరుస్తోంది.

తాజాగా శ్రద్ధా షేర్ చేసిన హాట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. బ్లాక్ ట్రాక్ ఫ్యాంట్ .. బ్లాక్ టాప్ ధరించిన శ్రద్ధా లుక్ సో కూల్ అంటూ అభిమానులు ఇన్ స్టాలో వ్యాఖ్యల్ని జోడిస్తున్నారు. మునుపటితో పోలిస్తే.. శ్రద్ధా మరింత హాట్ గా కనిపిస్తోందని ప్రశంసలు కురుస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here