Home Entertainment ఖాళీగా ఉన్నానంటోన్న దంగ‌ల్ భామ‌

ఖాళీగా ఉన్నానంటోన్న దంగ‌ల్ భామ‌

19
0

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారు. జీవనాధారం కోల్పోయిన చాలా మంది ఆర్థిక సమస్యలు తాలలేక ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు బతుకు భారంగా సాగిస్తున్నారు. గత ఏడాది కరోనా లాక్ డౌన్ కారణంగా ఇండియాలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అందరం చూశాం. ఎన్నో కుటుంబాలు కనీసం తినడానికి తిండి కూడా సరిగ్గా లేక నానా ఇబ్బందులు పడ్డాయి. అదే సమయంలో సినీ కార్మికులు కూడా లాక్ డౌన్ కారణంగా పని లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్లీ ఈ ఏడాది కూడా సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో దంగల్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ.. కరోనా వల్ల ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నాయి అనుకుంటున్న సమయంలో మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో ప్రమాదం వచ్చింది. ఈ పరిస్థితులు చక్కదిద్దుకుంటే అందరికి మళ్లీ ఉపాది లభిస్తుంది. అంతా సర్దుకునే వరకు నేను కూడా ఒక నిరుద్యోగినే. ప్రస్తుతానికి చేతిలో నాకు ఏ పని లేదు. షూటింగ్స్ నిలిచి పోవడం వల్ల కొన్ని వారాలుగా ఖాళీగానే నిరుద్యోగిగా ఉంటున్నట్లుగా పేర్కొన్న ఫాతిమా సనా త్వరలోనే ఈ పరిస్థితులు సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. దంగల్ సినిమా తో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుని అమీర్ ఖాన్ దృష్టిలో పడ్డ ఈ అమ్మడు ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాలో ఆయనకు జోడీగా నటించింది. బిట్టూ బాస్ సినిమాలో కూడా నటించి ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా గడిలో పడుతుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా కారణంగా ఆమె కెరీర్ ఎక్కడికి అక్కడే నిలిచి పోయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బోల్డ్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఫాతిక నోట నిరుద్యోగిని అంటూ వ్యాఖ్యలు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here