Home Entertainment ఫాలోవ‌ర్స్‌కి పిచ్చెక్కిస్తోన్న భామ‌

ఫాలోవ‌ర్స్‌కి పిచ్చెక్కిస్తోన్న భామ‌

33
0

బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా వరుసగా చిత్రాలు చేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. మరో వైపు కూతురు కృష్ణ ష్రాఫ్ మాత్రం నెట్టింట రెగ్యులర్ గా హాట్ ఫొటో షూట్ లతో రచ్చ చేస్తుంది. టైగర్ ష్రాఫ్ చెల్లి అవ్వడంతో సహజంగానే కృష్ణ ష్రాఫ్ సోషల్ మీడియా పోస్ట్ లపై ఆసక్తి ఉంటుంది. అలాంటిది ఆమె హాట్ ఫొటోలతో రెచ్చి పోతే ఇంకా ఏమైనా ఉందా. మిలియన్ ల కొద్ది ఫాలోవర్స్ ఆమె ఫొటోలకు ఫిదా అవుతూనే ఉంటారు. ఆమద్య ప్రియుడితో ఉన్న హాట్ ఫొటో లను షేర్ చేసి అందిరిని ఆశ్చర్యపర్చింది.

సినిమాల్లో నటించకున్నా కూడా హీరోయిన్స్ కంటే అధికంగా క్రేజ్ ఉన్న కృష్ణ ష్రాఫ్ ప్రియుడితో కొన్నాళ్ల క్రితం బ్రేకప్ అయ్యింది. ప్రియుడితో ఇన్నాళ్లు ఆస్ట్రేలియాకు పరిమితం అయిన కృష్ణ ష్రాప్ బ్రేకప్ తర్వాత ముంబయికి మకాం మార్చింది. ఆమె నుండి వరుసగా వస్తున్న ఫొటో షూట్ లతో ఫాలోవర్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సహజంగా హీరోయిన్స్ మాత్రమే బికినీ తో ఫొటో షూట్ ఇస్తారు. కాని కృష్ణ ష్రాఫ్ బికినీ ఫొటో షూట్ తో రచ్చ చేసింది.

ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో ప్రియుడితో రెగ్యులర్ గా హాట్ ఫొటో లను షేర్ చేసిన ఈమె ఇప్పుడు సోలో ఫొటో షూట్ లతో టైమ్ పాస్ చేస్తుంది. ప్రస్తుతానికి సింగిల్ అంటున్న కృష్ణ త్వరలో కొత్త ప్రియుడిని పరిచయం చేయబోతుందనే వార్తలు బాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్నాయి. త్వరలోనే ఈమె ఆ విషయాన్ని వెళ్లడించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here