Home Entertainment రాజ‌మౌళి మీద విరుచుకుప‌డుతున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

రాజ‌మౌళి మీద విరుచుకుప‌డుతున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

195
0

ప‌వ‌న్ ఫ్యాన్స్ ట్విట్ట‌ర్‌లో స‌రికొత్త హంగామాను శ్రీకారం చుట్టారు. అది కూడా ఏకంగా రాజ‌మౌళి సినిమాతోనే పోటీ పెట్టుకుంటున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. ‘బాహుబ‌లి’తో తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిన రాజ‌మౌళి ఇప్పుడు ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం జ‌క్క‌న్న ఎంత మంది స్టార్స్‌ను రంగంలోకి దింపినా, ఎన్ని రికార్డులు క్రియేట్ చేసినా, అది త‌మ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ సినిమా విడుద‌ల కానంత వ‌ర‌కే, విడుద‌లైన త‌ర్వాత ఈ సినిమా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తుంద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. అంత‌కు ముందు రామ్‌చ‌ర‌ణ్‌తో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘మ‌గ‌ధీర’ రికార్డుల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ ‘అత్తారింటికి దారేది’ క్రాస్ చేసిన విష‌యాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెబుతున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌. మ‌రి ప‌వ‌న్ ఫ్యాన్స్ చెబుతున్న జోస్యాన్ని నిజం చేస్తారేమో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here