Home Entertainment బిర్యానీ లో లెగ్ పీస్ రాలేదా.. మ‌రి ఏం చేయ‌మంటావ్ – కేటీఆర్

బిర్యానీ లో లెగ్ పీస్ రాలేదా.. మ‌రి ఏం చేయ‌మంటావ్ – కేటీఆర్

208
0

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో తనదైన శైలిలో కామెంట్స్ చేయడంతో పాటుగా.. తన దృష్టికి వచ్చే సమస్యలపై కూడా స్పందిస్తుంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతో మందికి ఆయన ట్విట్టర్‌ వేదికగా వైద్య సాయం కోరుతున్న పలువురికి.. సాయం అందేలా చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో కూడా కొందరు నెటిజన్స్.. సిల్లీ రీజన్స్‌తో కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తుండటం.. ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. ఓ వ్యక్తి తాను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. లెగ్ పీస్ రాలేందంటూ ట్వీట్ చేశాడు. అందులో కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘నేను ఏమి చేస్తానని మీరు ఆశించారు?’అని బదులిచ్చారు.వివరాలు.. తోటకూరి రఘపతి అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి మంత్రి కేటీఆర్, జోమాటో‌ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘నేను ఎక్స్‌ట్రా మసాలా, లెగ్ పీస్‌తో కూడిన బిర్యానీని ఆర్డర్ చేశాను. కానీ నాకు వాటిలో ఏది కూడా రాలేదు. ఇదేనా ప్రజలకు సర్వ్ చేసే విధానం’అని పేర్కొన్నాడు. అయితే కరోనా వేళ.. ఇలాంటి ట్వీట్‌లో తనను ట్యాగ్ చేయడంపై కేటీఆర్ స్పందించారు. ‘బ్రదర్ ఇందులో నన్ను ఎందుకు ట్యాగ్ చేశారు. నేను ఏమి చేస్తానని మీరు ఆశించారు?’అని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. అయితే కేటీఆర్ రిప్లై ఇచ్చిన కాసేపటికే.. తోటకూరి రఘపతి అకౌంట్ నుంచి చేసిన ట్వీట్ డీలిట్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here