నిజానికి ఈ భామ పేరు ఫరియా అయినా ఆ పేరు కంటే చిట్టి అనే జనాలు ఎక్కువగా గుర్తు పడుతున్నారు. చిట్టి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనకు మాత్రమే సాధ్యం అయిన విచిత్రమైన డ్యాన్స్ లు వేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఆమె వేస్తున్న డాన్స్ ఆమెకు మాత్రమే అర్ధం అవుతుందో, ఏమో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్ లు వేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది.
అందరికీ షాక్ ఇక ఫరియా అబ్దుల్లా బర్త్ డే అంటూ ఈరోజు గూగుల్ తల్లి చెప్పడంతో ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి. దీంతో ఈ విషయం గురించి ఫరియా మాట్లాడుతూ తనకు విషెస్ చెప్పిన అందరికీ షాకిచ్చారు. అందరి ప్రేమ బాగుంది, కానీ అసలు ఈ రోజు నా బర్త్ డే కాదు.. అందరూ విషెస్ చెబుతున్నారని చెప్పుకొచ్చింది. ఇక ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న ఆమె నవ్వుతూ షాకిచ్చింది. అయితేనేమి తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారికి థాంక్స్ అని ఆమె చెప్పుకొచ్చింది.
ఇక ఫరియా అబ్దుల్లాకి జాతి రత్నాలు తొలి సినిమానే అయినా సూపర్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందుకే ఫరియా అబ్ధుల్లాకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మాస్ మహరాజా రవి తేజ, త్రినాథ రావు నక్కిన కాంబినేషన్ లో తెరకక్కనున్న ఒక సినిమాలో హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లాకి అవకాశం ఇచ్చారనే ప్రచారం ఉంది.