Home Entertainment వైర‌ల్ గా మారిన‌ సురేష్ క‌రోనా వీడియో

వైర‌ల్ గా మారిన‌ సురేష్ క‌రోనా వీడియో

214
0

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రెటీలకు, దర్శకనిర్మాతలకు వైరస్ వ్యాపించగా కొందరు బయట పడుతున్నారు. మరి కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. ఇక షూటింగులు వాయిదా పడటంతో సెలబ్రేటిలంతా ఇంట్లో ఉంటూ కరోనా జాగ్రత్తలు తెలుపుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ నటి కీర్తి సురేష్ కూడా కోవిడ్ జాగ్రత్తలను తన భాషలో తెలుపుతూ బాగా ఆకట్టుకుంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదిక ద్వారా ఓ వీడియో అభిమానులతో పంచుకోగా.. అందులో వైరస్ నుంచి రక్షించుకోవడానికి పలు జాగ్రత్తలు తెలిపింది కీర్తి సురేష్. కరోనా అడ్డుకట్ట వేయడానికి బాధితుల సంఖ్య తగ్గించడానికి డబుల్ మాస్క్ ధరించాలని, శానిటైజర్ ను ఉపయోగించాలని తెలిపింది. అంతేకాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయాలి అంటూ ఎక్కువ జనం ఉన్న ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలని కోరింది.
ప్రభుత్వం చేపట్టిన నిబంధనలను తప్పకుండా పాటించడం ముఖ్యమైనదని.. తాను కూడా ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపింది. ఇక అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ ను కొంత వరకు తగ్గించవచ్చని.. మన ఫ్యామిలీని మనం రక్షించుకోవచ్చు అని కొన్ని విషయాలు పంచుకుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. తన మాతృభాషతో ఎంతో చక్కగా వివరించింది. ఈ వీడియోను చూసిన నెటి జనలు కీర్తి సురేష్ చెప్పిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here