Home Entertainment సారంగ ద‌రియా మ‌రో రికార్డు

సారంగ ద‌రియా మ‌రో రికార్డు

162
0

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల పేరు తెచ్చుకున్నారు. అందమైన ప్రేమకథలను అర్ధవంతంగా చాలా సహజంగా రూపొందించడంలో శేఖర్ కమ్ముల దిట్ట. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శేఖర్ కమ్ములు. ఇక సాయి పల్లవిని తెలుగు తెరకు పరిచయం చేస్తూ.. ఫిదా అనే మరో అందమైన ప్రేమ కావ్యాన్ని తెరకెక్కించి అందరిని ఫిదా చేసారు. ఇప్పుడు మరో సారి సాయి పల్లవిని హీరోయిన్ గా పెట్టి లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు శేఖర్. అక్కినేని నాగ చైతన్, సాయి పల్లవి జంటగా ఈ సినిమా రూపొందుతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు పాటలు, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమానుంచి రిలీజ్ అయిన సారంగదరియా.. పాట సంచలనం సృష్టిస్తుంది. తాజాగా ఈ పాట యూట్యూబ్ వేదికగా 200మిలియన్స్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. మంగ్లీ పాడిన ఈ పాటకు హీరోయిన్ సాయిపల్లవి స్టెప్స్ అదిరిపోయాయి. ఆ విధంగానే పాటకు కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి.  నిజానికి ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాకు సిహెచ్ పవన్ సంగీతం అందించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అమిగోస్ క్రియేషన్స్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  మరి ఈ సినిమా కొత్త  రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here