Home Entertainment శోభనం గదిలో.. సుధీర్ నా బావ అంటూ శ్రీముఖి రచ్చ

శోభనం గదిలో.. సుధీర్ నా బావ అంటూ శ్రీముఖి రచ్చ

235
0

సుడిగాలి సుధీర్ ఎంట్రీతో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కామెడీ షోకి మంచి హైప్ వచ్చింది. దీనికి తోడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ కంటెస్టెంట్లు, టీం లీడర్లు రంగంలోకి దిగడంతో ఈ షోకి ఆదరణ పెరిగింది. అయితే శ్రీదేవి డ్రా కంపెనీకి ఉన్న డ్రామా ఆర్టిస్ట్‌లు సరిపోకపోవడంతో గ్లామర్ అద్దడం కోసం టాలీవుడ్ లౌడ్ స్పీకర్ శ్రీముఖిని కూడా రంగంలోకి దించేశారు.

వచ్చీరావడంతోనే సుడిగాలి సుధీర్‌తో బావా అని వరస కలిపేసింది శ్రీముఖి మరదలు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1. 00 గంటలకు ప్రసారం అవుతున్న ఈ షోకి సంబంధించి ప్రోమో విడుదల చేయగా.. ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు సుధీర్, శ్రీముఖి.
తాజా ప్రోమోలో సుధీర్ తనదైన శైలిలో డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోయాడు. ‘ఏదైనా ప్రోగ్రామ్ తెచ్చావా? లేదా.. అని ఇమ్మానుయేల్ అడిగితే.. ‘ప్రోగ్రామ్ కోసం వెళ్లి తలుపులు కొడుతుంటే.. అందరూ నన్ను కొడుతున్నారు సార్’ అంటూ పంచ్ వేశాడు. తలుపులు ఎవరు కొట్టమన్నారయ్యా.. బెల్‌లు కొట్టొచ్చు కదా అంటే.. బాత్ రూంలకి బెల్‌లు కూడా ఉంటాయా? అని కౌంటర్ వేశాడు సుధీర్.

అది కాదు.. ఏదైనా శుభకార్యానికి వెళ్లి ప్రోగ్రామ్ అడిగి పెర్ఫామ్ చేయొచ్చు కదా అని ఇమ్మానుయేల్ అంటే.. ‘మొన్న శుభకార్యానికే వెళ్లి స్టేజ్ ఇవ్వండి పెర్ఫామ్ చేస్తా అని అంటే కూడా కొట్టారు.. ఎందుకంటే శోభనం గదిలో స్టేజ్ ఉండదంట కదా’ అని అమాయకంగానే డబుల్ మీనింగ్ పంచ్ వేశాడు సుధీర్.

ఆ తరువాత ‘ఓ రాములమ్మా.. రాములమ్మా’ అంటూ ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ఫ్యాక్షనిస్ట్ డాటర్‌గా పంచ్‌లతో రెచ్చిపోయింది. సుధీర్‌ని చూపిస్తూ ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి అతను మీకు బావ అంటూ తెగ సిగ్గు పడిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here