Home Entertainment ఆ ప్ర‌శ్న‌కు దిమ్మ‌తిర‌గే స‌మాధ‌నం ఇచ్చిన సురేఖ‌వాణి కూతురు

ఆ ప్ర‌శ్న‌కు దిమ్మ‌తిర‌గే స‌మాధ‌నం ఇచ్చిన సురేఖ‌వాణి కూతురు

203
0

తెలుగు సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖా వాణి. ఇక సినిమాల్లోనే కాకుండా.. సురేఖా వాణికి సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్ధరికీ నెట్టింట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఇక సురేఖా వాణి కంటే ఇప్పుడు ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియాలో లైవ్ చాట్‌లు పెడుతూ, తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతూ.. యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ సమయంలోనే కొందరు నెటిజన్స్ కొన్ని పర్సనల్ ప్రశ్నలు, అడగకూడనవి కూడా అడిగేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సుప్రిత కూడా వారిపై కాస్త ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు తాజాగా మరోసారి సుప్రిత సోషల్ మీడియోలో లైవ్ సెషన్ పెట్టారు.

అందులో ఏదైనా ప్రశ్నను అడగండి.. సమాధానాలు చెబుతాను అని అన్నారు. ఇక అప్పుడే ఓ నెటిజన్ ‘ఆర్ యూ వర్జిన్’ అంటూ అడగకూడని ప్రశ్నను అడిగాడు. దీనికి సుప్రిత కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలోని కోర్డ్ సీన్ సుప్రిత వాడుకుంది. అందులో కాష్ రాజ్ అంజలిని అడిగినట్టు.. పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోతూ అబ్జెక్షన్ అంటూ కోర్టు రూంలో గందరగోళాన్ని సృష్టించే సీన్‌‌ను సుప్రిత షేర్ చేశారు. ఆర్ యూ వర్జిన్ అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుప్రిత మరోసారి తన స్టైల్లో సమాధానం చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here