Home Entertainment సౌత్‌లో ట్విట్ట‌ర్ టాప‌ర్ మ‌హేష్‌బాబు

సౌత్‌లో ట్విట్ట‌ర్ టాప‌ర్ మ‌హేష్‌బాబు

162
0

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఆయన ట్విట్టర్ ద్వారా అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాక తన ఫ్యామిలీ విషయాలు అలాగే తన అనుభవాలను, తనకి నచ్చిన అన్ని అంశాలను పంచుకుంటూ ఉంటారు.

ఇక మహేష్ ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా మహేష్ ఎలాంటి కంటెంట్ పెట్టినా సరే దానికి మంచి రీచ్ తీసుకువస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ హీరో గురించి ఇంటర్నెట్ లో ట్రెండ్ సృష్టిస్తుంటారు. టాలీవుడ్ అందరి హీరోల కంటే ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన వారి సంఖ్యలో మహేష్ బాబు ముందు ఉన్నాడు. ఆయనకు ట్విట్టర్లో 11.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

తాజాగా ట్విట్టర్ లో మ‌హేష్ మ‌రో రికార్డ్ సాధించాడు. మ‌హేష్ చేసిన ట్వీట్స్‌కి 24 సార్లు 100K లైక్స్ రాగా, ఈ విషయంలో ఆయనకు అగ్ర‌స్థానం ద‌క్కింది. త‌ర్వాతి స్థానంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్స్‌కి 6 సార్లు 100K లైక్స్, రానా దగ్గుబాటి చేసిన ట్వీట్స్‌కి 3 సార్లు 100K లైక్స్, ఆ తరువాత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్స్‌కి 2 సార్లు, నితిన్ చేసిన ట్వీట్స్‌కి 2 సార్లు, అల్లు అర్జున్ చేసిన ట్వీట్స్‌కి 2 సార్లు 100K లైక్స్ వచ్చాయి. ఇక రామ్ చరణ్, నాని ఒక్కసారి మాత్రమే ఈ ఫీట్ సాధించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here