తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం

  443
  0

  తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం

  తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తన పుట్టిన రోజున తన ఆఫీసులో పనిచేస్తున్న యాంకర్ మోనిక వివాహం, మాధవరావు తో కమిటీ సభ్యులమధ్య అత్యంత వైభవంగా జరిపించారు. నిరుపేద కుటుంబానికి చెందిన మోనిక గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో యాంకర్ గా, రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నారు. చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నితానై బంగారు తాళిబొట్టు, కమ్మలు, చైన్ మరియు మెట్టెలు బహుమతిగా అందించారు. వేద పండితుల మంత్రాలమధ్య ఘనంగా ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలోనే కరోన నిబంధనలు పాటిస్తూ అతికొద్ది మంది అతిధుల సమక్షంలో పెళ్లి కార్యక్రమం నిర్వహించారు. వరుడు మాధవరావు బిటెక్, వధువు మౌనిక ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మా దగ్గర పనిచేస్తున్న మౌనిక వివాహం నా చేతుల మీదుగా చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. వధూవరులిద్దరు కలకాలం సుఖసంతోషాలతో, చల్లగా ఉండాలని దీవిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ చైర్మన్ గురురాజ్, కాచం సత్యనారాయణ మరియు కమిటి సభ్యులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here