Home Entertainment బాలకృష్ణ మూవీలో పూర్ణకు అలా ఛాన్స్.. బోయపాటి ఫుల్ స్కెచ్ ఇదే!

బాలకృష్ణ మూవీలో పూర్ణకు అలా ఛాన్స్.. బోయపాటి ఫుల్ స్కెచ్ ఇదే!

165
0

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ‘. BB3గా హాట్రిక్ హిట్ కొట్టేయడానికి ఈ ఇద్దరూ పక్కాగా రంగంలోకి దిగబోతున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది.

బోయపాటి దర్శకత్వంలో ”సింహా, లెజెండ్” సినిమాలతో మాస్ ఆడియన్స్‌ని ఉర్రూతలూగించిన బాలయ్య బాబు ఈ సినిమాలోనూ అదే పంథా కంటిన్యూ చేయబోతున్నారట. మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ఆయన క్యారెక్టర్ డిజైన్ చేశారట బోయపాటి. ఇందులో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించనున్నారు. అయితే ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? వాళ్ళతో బాలయ్య స్క్రీన్ స్పేస్ ఏ మేర ఉండబోతోంది అనే దానిపై చర్చలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఫస్ట్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌కి కాస్త నిడివి ఎక్కువగా ఉండే పాత్ర ఇచ్చారని, ఆమెతో పోలిస్తే పూర్ణ నిడివి తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందనేది తాజా సమాచారం. పాత్ర నిడివి చిన్నదే అయినా, బాలకృష్ణ భార్య పాత్రలో కనిపించే ఛాన్స్ రావడంతో ఆమె వెంటనే అంగీకరించిందని సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపించే పూర్ణ చిత్రంలో కీలక మలుపు తిప్పే క్యారెక్టర్ చేస్తోందట. ఈ మూవీ ఆమె కెరీర్‌కి బాగా ప్లస్ కావొక్కనే టాక్ నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here