Home Entertainment రోజా కూతురు అన్షు మాలికని చూశారా..?

రోజా కూతురు అన్షు మాలికని చూశారా..?

57
0

సీనియ‌ర్ హీరోయిన్‌, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా కూతురు అన్షు మాలిక ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. రెండు రోజుల క్రితం ఈమె పోస్ట్ చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో బాగా తిరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అన్షు మాలిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌నే ప్ర‌చారం మ‌ళ్లీ మొద‌లైంది. ప్రేక్ష‌కుల క‌ళ్ల‌లో ప‌డ‌డానికి సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా ఉంటుంద‌నే వార్త‌లు పుట్టుకొస్తున్నాయి.
ప్ర‌స్తుతం అన్షు వ‌య‌సు ప‌ద్దెనిమిదేళ్లు. అప్ప‌ట్లో రోజా కూడా దాదాపు ఇదే వ‌య‌సులో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో 100 సినిమాల‌కు పైగానే న‌టించింది. అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. ఇప్పుడు సినిమాలు మానేసి రాజ‌కీయాల‌తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే రోజా కూతురు హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌ని రెండేళ్లుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై రోజా కూడా ఓసారి నోరు విప్పింది. ఇప్ప‌ట్లో త‌న కూతురు ఇండ‌స్ట్రీకి రాద‌ని.. త‌ర్వాత ఆలోచిస్తాన‌ని చెప్పుకొచ్చింది. ఇండ‌స్ట్రీకి రావ‌డం త‌న‌కు ఇష్ట‌మైతే ఓకే చెప్తా.. కానీ బ‌ల‌వంత‌పెట్ట‌న‌ని పేర్కొంది.
ఇప్ప‌టికే కొంద‌రు ద‌ర్శ‌కులు అన్షు కోసం సంప్ర‌దించ‌గా.. తన కూతురు సినీ రంగప్రవేశం గురించి ఆలోచించడం లేదని రోజా వారికి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్షు చదువులతో బిజీగా ఉంది. అది అయిపోయిన తర్వాతే అసలు నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది రోజా. అప్పటి వరకు ఈ గాసిప్స్ ఆగవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here