Home Entertainment అనుష్క ఓటీటీ ఎంట్రీ ఇవ్వ‌నుందా..?

అనుష్క ఓటీటీ ఎంట్రీ ఇవ్వ‌నుందా..?

187
0

టాలీవుడ్ బొమ్మాలి అనుష్క ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోందంటూ నిన్నట్నుంచి కథనాలు వస్తూనే ఉన్నాయి. మరి ఇందులో నిజమెంత? అనుష్క నిజంగానే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోందా? అసలు ఏదైనా ఓటీటీ సంస్థ ఆమెను సంప్రదించిందా లేదా? నిన్నట్నుంచి వినిపిస్తున్న పుకార్లలో కొంత నిజం ఉంది. అసలు సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ అనే ఓటీటీ సంస్థ అనుష్కను సంప్రదించిన మాట వాస్తవం. ఆ సంస్థ అనుష్కను సంప్రదించడానికి కారణం ఉంది. టాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద దర్శకుడు ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాసుకున్నాడు. తన దగ్గర ఫిమేల్ సబ్జెక్ట్ ఉందని, దాన్ని సినిమాగా తీయడానికి ప్రస్తుతం తనకున్న ఇమేజ్ అడ్డొస్తోందని ఆ దర్శకుడు గతంలోనే వెల్లడించాడు.

ఇప్పుడదే సబ్జెక్ట్ తో అనుష్క లీడ్ రోల్ గా ఓటీటీ మూవీ తీయాలనేది ప్రతిపాదన. (ప్రతిపాదన మాత్రమే). అనుష్క ఒప్పుకుంటే ఇదొక ఓటీటీ ఒరిజినల్ మూవీగా మారుతుంది. ఆమె ఇంకాస్త ఎక్కువ కాల్షీట్లు ఇస్తే వెబ్ సిరీస్ గా కూడా మార్చడానికి సదరు సంస్థ సిద్ధంగా ఉంది. ఇక బడ్జెట్ సమస్యలైతే ఆ సంస్థకు లేనే లేవు.

ఎటొచ్చి అనుష్క నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. తన కెరీర్ లోనే అత్యథిక పారితోషికాన్ని ఆఫర్ చేస్తామన్నప్పటికీ అనుష్క ప్రస్తుతానికి ఈ ప్రపోజల్ కు ఓకే చెప్పలేదు. దీనికి ఓ కారణం ఉంది.

ఆమె యూవీ క్రియేషన్స్ కు ఓ సినిమా చేయాల్సి ఉంది. అది స్టార్ట్ చేయకుండా మరో సినిమాకు లేదా వెబ్ సిరీస్ కు ఆమె షిఫ్ట్ అయ్యే పరిస్థితి లేదు. సో.. అనుష్కకు భారీ ఆఫర్ వచ్చిన మాట వాస్తవం, దాన్ని ఆమె కొన్నాళ్ల పాటు పక్కనపెట్టి మాట కూడా అంతే వాస్తవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here