Home movie news వీడు గోల్డ్ ఎహె.. విజ‌య‌దేవ‌ర‌కొండ‌పై చార్మి కామెంట్‌..

వీడు గోల్డ్ ఎహె.. విజ‌య‌దేవ‌ర‌కొండ‌పై చార్మి కామెంట్‌..

211
0

రౌడీ స్టార్‌ హీరో విజ‌య్ దేవ‌రకొండ మే 9న త‌న బ‌ర్త్‌డే జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న లైగ‌ర్ చిత్ర టీజ‌ర్ విడుద‌ల అవుతుంది అని అంద‌రు అనుకున్నారు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో విడుద‌ల చేయ‌డం భావ్యం కాద‌ని భావించిన మేక‌ర్స్ వాయిదా వేశారు. త్వ‌ర‌లో అంద‌రికి దిమ్మ తిరిగే స‌ర్‌ప్రైజ్ ఇస్తామ‌ని అన్నారు. అయితే విజ‌య్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పలువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు అంద‌జేయ‌గా, ఛార్మి చేసిన ట్వీట్ అందరిని ఆక‌ట్టుకుంటుంది.

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా, ఆయ‌న‌తో దిగిన ఫొటోని షేర్ చేసిన ఛార్మి.. నీ గురించి చెప్పడానికి ఒక లైన్’ఏంంటే ‘నువ్వు బంగారం 26 క్యారెట్ గోల్డ్ అని కామెంట్ పెట్టింది. ఛార్మి పెట్టిన కామెంట్‌కు విజ‌య్ అభిమానులు ఇది నూటికి నూరు శాతం నిజం అంటున్నారు. కాగా, ఛార్మి నిర్మాణంలో పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా “లైగర్”. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here