Home Entertainment ప్ర‌తి రోజు రాత్రి అదే ప‌ని.. నెటిజ‌న్ల‌తో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్న ప్ర‌ముఖ సింగ‌ర్‌

ప్ర‌తి రోజు రాత్రి అదే ప‌ని.. నెటిజ‌న్ల‌తో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్న ప్ర‌ముఖ సింగ‌ర్‌

48
0

ప్ర‌తి రోజు రాత్రి అదే ప‌ని.. నెటిజ‌న్ల‌తో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్న ప్ర‌ముఖ సింగ‌ర్‌

సింగర్ సునీత గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె తీయని గొంతు వినని, ఆమె పాటలను ఆస్వాధించని తెలుగువాళ్లెవ్వరూ ఉండరు. మెలోడి పాటలను మరింత తీయగా పాడే సునీత ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ అవుతున్నారు. రెండో పెళ్లి తరువాత సునీత సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పుడు సునీత బుల్లితెర మీదా రచ్చ చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో రామ్ వీరపనేనిని వివాహాం చేసుకున్న సునీత పూర్తిగా మారిపోయారు. పెళ్లి తరువాత కొత్త సునీతను లోకానికి పరిచయం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇది వరకెన్నడూ లేనంత యాక్టివ్ అయ్యారు. వెరైటీ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు సునీత డ్రామా జూనియర్స్ అంటూ జీ తెలుగు చానెల్‌లో హల్చల్ చేస్తున్నారు.
ప్రస్తుతం బయట ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలిసిందే. అందరూ భయాందోళనలో బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలోఉన్నారు. అలాంటి తరుణంలో సునీత తన గొంతును వినిపిస్తూ కాసేపైనా అందరిలోనూ ప్రశాంతతను కలిగించే ప్రయత్నం చేశారు. నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఇన్ స్టాగ్రాంలో సునీత లైవ్‌లోకి వచ్చారు.
నెటిజన్ల కామెంట్లకు బదులు ఇస్తూనే.. వారు కోరిన పాటలన్నీ లైవ్‌లోనే ఆలపించారు. తమ జోడి బాగుందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుంటే అందరికీ థ్యాంక్స్ చెప్పారు. అలా సునీత పాటలు పాడుతుంటే అందరూ మైమరిచిపోయారు. సునీత కెరీర్‌లోని మెలోడి పాటలను అందరూ అడిగేశారు. అయితే ఈక్రమంలో సునీత కొన్ని కామెంట్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here