Home Entertainment నాగార్జునతో రొమాన్స్‌కు రెడీ అయిన ద‌బాంగ్ భామ‌..!

నాగార్జునతో రొమాన్స్‌కు రెడీ అయిన ద‌బాంగ్ భామ‌..!

51
0

ఈమ‌ధ్యే ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు కింగ్ అక్కినేని నాగార్జున. హైదరాబాద్‌లో జరిగిన బాంబు బ్లాస్టుల తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్, టెర్రరిస్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అయితే ఈ సినిమా థియేటర్లలో అంతగా అలరించకపోయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా ట్రెండింగ్ ఉంది. అయితే నాగార్జున ‘బంగార్రాజు’ అనే టైటిల్‌తో తన నెక్ట్స్ సినిమా చేస్తున్నార‌నే విష‌యం తెలిసిందే.

2015 సంక్రాంతికి విడుదలై భారీ హిట్‌ను సొంతం చేసుకున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజును రూపొందిస్తున్నట్లు ఎప్పుడో ప్రకటన చేశారు. గ్రామీణ నేపథ్యంలోనే మరో సినిమా చేయాలని భావించిన నాగార్జున.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. చాలా రోజుల పాటు ఈ మూవీ స్క్రిప్ట్ పనులపై కసరత్తులు చేసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల ఇటీవలే ఆ పని ఫినిష్ చేశారట. ఈ ఏడాది జూలై రెండవ వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్‌గా ‘దబాంగ్’ బ్యూటీ సోనాక్షి సిన్హాని అనుకుంటున్నారట. బాలీవుడ్ స్టార్ హీరో, మాజీ కేంద్ర మంత్రి శతృజ్ఞ సిన్హా కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సోనాక్షి.. గతంలో రజనీకాంత్ సరసన ‘లింగా’ అనే సినిమాలో చేసింది. అయితే కొంతకాలంగా ఈ అమ్మడికి సరైన హిట్లు లేకపోవడంతో టాలీవుడ్‌పైపు ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా బృందం ఆమెకు తొలి టాలీవుడ్‌ అవకాశం కల్పించాలని భావిస్తున్నారట. అయితే నాగార్జున సరసన హీరోయిన్‌గా చేస్తే తనకు మంచి బ్రేక్ లభించే అవకాశం ఉందని సోనాక్షి కూడా అనుకుంటోందని సమాచారం. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here