Home Fashion అందాల ఆర‌బోత‌తో హీటెక్కిస్తున్న సోనారిక

అందాల ఆర‌బోత‌తో హీటెక్కిస్తున్న సోనారిక

197
0

తెలుగు చిత్రసీమకు సుపరిచితమైన ఈ నార్త్ బ్యూటీ సోనారిక బదోరియా. జాదుగాడు చిత్రంతో తెరకు పరిచయమైంది. నాగశౌర్య ఆ చిత్రంలో హీరో. తొలి సినిమా నుంచే తన గ్లామర్ షో చేసి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నటించిన స్పీడున్నోడులోనూ సోనారికా గ్లామర్ షో యువతరానికి ఫుల్ గా కిక్ ఇచ్చింది. ఈడోరకం ఆడోరకంలోనూ నటించింది. కానీ సరైన హిట్లు లేక తర్వాత తెలుగు పరిశ్రమలో ఛాన్సుల్లేవ్.

అటుపై బాలీవుడ్ లో సాన్ సీన్ అనే చిత్రంలో నటించింది. ఇంద్రజిత్ అనే తమిళ చిత్రంలోనూ నాయికగా మెప్పించింది. ఇటీవల ఈ భామకు పెద్ద గ్యాప్ వచ్చింది. దీంతో టీవీ సీరియల్స్ లోనూ నటించింది. నిజానికి తనకు ఆరంగేట్ర లైఫ్ ఇచ్చిన సీరియల్స్ ని నమ్ముకుందని చెప్పాలి. మొన్నటి వరకూ హిందీ సీరియల్స్ లో నటించింది. హరహర మహదేవ్ సీరియల్ చూస్తున్న ప్రతీ ఒక్కరికి సోనారికతో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందులో పార్వతిగా నటించింది.

ప్రస్తుతం మరోసారి పెద్ద తెర రీలాంచ్ కోసం ప్రయత్నిస్తోంది. అవకాశాల కోసం గ్లామర్ షోకి దిగింది. అందుకు తగ్గట్టే వేడెక్కించే ఫోజులతో ఈ చెలరేగుతోంది. సోనారిక సన్నజాజి నడుముతో మత్తెక్కించ్చే చూపులతో కుర్రాళ్ళ మైండ్ బ్లాంక్ చేసేస్తోంది ఈ బ్యూటీ. ఇదిగో ఇలా బెడ్ రూమ్ లో విరహయోగినినే తలపిస్తోంది. పింక్ ఫ్రాకులో ఎద అందాలతో కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా దూసుకెళుతున్నాయి. మరి ఇంతగా ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారికకు టాలీవుడ్ పిలిచి ఛాన్సులిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here