Home Entertainment సోనూ సూద్ ఆస్తి ఎంతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సోనూ సూద్ ఆస్తి ఎంతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

472
0

క‌రోనా తొలి దశలోనే చాలా మందికి ఈ డౌట్ వ‌చ్చుంటుంది. సోనూ సూద్ ఒక్కడే వేలాది మందికి సహాయం చేస్తున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అతని ఆస్తులు ఎంత? అనే చర్చలు చేసినవాళ్లు కూడా ఉన్నారు. ఏమీ ఆశించకుండానే ఈ పనులు చేస్తాడా? అనే అనుమానపు పక్షులు కూడా సోషల్ మీడియాలో తిరిగాయి. ఇప్పుడు.. సెకండ్ వేవ్ లోనూ బాధితులకు నేనున్నా అంటూ ఆపన్నహస్తం అందిస్తుండడంతో.. మరోసారి సోనూ ఆస్తులు ఎంత అనే చర్చ మొదలైంది.

పది రూపాయలు సహాయం చేసి.. వంద రూపాయలు ప్రచారం కోరుకునేవారు ఎందరో ఉన్నారు. కానీ.. సోనూ మాత్రం తన సహాయం కోరిన వారికి కాదనకుండా సహకరిస్తున్నాడు. గతేడాది విమానం మాట్లాడి కార్మికులను స్వస్థలాలకు తీసుకెళ్లిన సోనూ.. ఈ మధ్య హెలీకాఫ్టర్ ను అంబులెన్స్ గా మార్చి ఓ ప్రాణం కాపాడాడు. తాజాగా.. బెంగళూరులోని ఓ ఆసుపత్రికి ఆక్సీజన్ సిలిండర్లు అందించి ఏకంగా 22 మంది ప్రాణాలు కాపాడాడు. ఈ విధంగా.. ఎందరినో ఆదుకుంటూ ముందుకు సాగుతున్నాడు సోనూ సూద్.

ఈ నేపథ్యంలోనే సోనూ సూద్ ఆస్తులు ఎంత అనే విషయమై ఓ బాలీవుడ్ సంస్థ వివరాలు వెల్లడించింది. సోనూ దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేశాడు. చేస్తున్నాడు. ఇక ఆయన బిజినెస్ కూడా చేస్తుంటాడు.

తాను సంపాదించిన డబ్బు ప్రధానంగా హోటల్ బిజినెస్ పైనే పెట్టాడు. ముంబైలో పెద్ద హోటల్ రన్ చేస్తున్నాడు సోనూ. కరోనా తొలిదశలో ఆ హోటల్ లో అభాగ్యులు తలదాచుకునేందుకు ఇచ్చాడు. ఇలా సినిమాలు వ్యాపారాలు కొనసాగిస్తున్న సోనూ ఆస్తులు దాదాపు రూ. 140 కోట్ల మేర ఉండొచ్చని సమాచారం. ఈ డబ్బుతోనే అందరికీ సహాయం చేస్తున్నాడు.

నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న బడా స్టార్స్ తో పోలిస్తే.. సోనూ ఆస్తులు చాలా చాలా తక్కువ. ఒక్క సినిమాకే వంద కోట్లకుపైగా తీసుకునే నటులు ఉన్నారు. కోటాను కోట్లు కలిగిన నిర్మాతలు దర్శకులు ఉన్నారు. ఒక్క బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్నారు. వేల కోట్లు కలిగినోళ్లు కూడా ఉన్నారు. కానీ.. వాళ్లకు పక్కవాడిని ఆదుకోవాలనే మనసే లేదు. అందుకే.. వాళ్లంతా రీల్ హీరోలు మేకర్స్. సోనూ లాంటి వాళ్లు మాత్రమే రియల్ హీరోస్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here