Home Entertainment బెడ్ రూమ్ సీన్‌లో న‌టించ‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డాను..

బెడ్ రూమ్ సీన్‌లో న‌టించ‌డానికి చాలా ఇబ్బంది ప‌డ్డాను..

198
0

‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ కెరీర్ మొదట్లో మద్రాస్ కేఫ్ అనే ఓ హిందీ సినిమాలో నటించింది.
అయితే ఈ సినిమాలో ఓ బెడ్ రూమ్‌ సీన్‌లో రాశీ ఖన్నా నటించాల్సి ఉందట.. ఆ సీన్ లో నటించడం రాశీఖన్నాకు అస్సలు ఇష్టం లేదు.
మరో వ్యక్తితో బెడ్ పై ఉండాలనే ఆలోచనే రాశీఖన్నాకు అస్సలు నచ్చలేదట. దీంతో ఆ సీన్ గురించి తల్లికి చెప్పిన రాశీ ఖన్నా ఆ సన్నివేశంలో నటించాలంటే భయంగా ఉందట. దీంతో తన భయాన్ని పోగొట్టుకునేందుకు ఆ సన్నివేశం గురించి తన తల్లికి చెప్పింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సమయం నుంచి రాశీ ఖన్నా తల్లి కూడా ఒకటే అందోళన చెందిందట. అంతేకాదు ఆమె తల్లికి ఆ రోజంతా నిద్ర పట్టలేదట..

ఇక ఆ తరువాత రోజు షూటింగ్ కు హాజరైన రాశీ ఖన్నా ఎలాగోలా ఆ సీన్స్‌ కు సంబంధించి షూటింగ్ ను పూర్తి చేశారట. అయితే సీన్ షూటింగ్ పూర్తైన వెంటనే రాశీఖన్నా తన కారవాన్ లోకి వెళ్లి తెగ ఏడ్చేశారట… ఇక అప్పటి నుంచి ఈలాంటీ సీన్స్ చేసేటప్పుడు యాక్టింగ్ వేరు నిజ జీవితం వేరు అనే విషయాన్ని నేర్చుకుందట.

ఇక రాశీ ఖన్నా ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె గోపీచంద్ పక్కా కమర్షియల్, నాగ చైతన్య థాంక్యూ చిత్రాల్లో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here