Home Entertainment టాలీవుడ్ సూప‌ర జోడీ బాల‌కృష్ణ విజ‌య‌శాంతిల‌దేనా..?

టాలీవుడ్ సూప‌ర జోడీ బాల‌కృష్ణ విజ‌య‌శాంతిల‌దేనా..?

197
0

టాలీవుడ్ సూప‌ర జోడీ బాల‌కృష్ణ విజ‌య‌శాంతిల‌దేనా..?

వెండితెరపై బాలకృష్ణ, విజయశాంతి జోడికి మంచి క్రేజ్ ఉండేది. వీళ్లిద్దరు కలిసి మొత్తంగా..17 చిత్రాల్లో జోడిగా నటించారు. ఇందులో మొదటి సారి బాలయ్య, విజయశాంతి ‘కథానాయకుడు’ సినిమాలో తొలిసారి హీరో,హీరోయిన్లుగా కలిసి నటించారు. చివరగా ‘నిప్పురవ్వ’ సినిమాలో జోడిగా నటించారు.

బాలకృష్ణ, విజయశాంతి మొత్తంగా 17 చిత్రాల్లో జోడిగా నటించారు. బాలకృష్ణ, విజయశాంతి జోడిపై అభిమానుల్లో ఎంతో క్రేజ్ ఉండేది.

తొలిసారి బాలకృష్ణ,విజయశాంతి హీరో, హీరోయిన్లుగా కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కథానాయకుడు’ సినిమాలో మొదటి సారి కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్‌ హిట్‌‌గా నిలిచింది.

బాలకృష్ణ సొంత బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కిన ‘పట్టాభిషేకం’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది.

భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన‘ముద్దుల కృష్ణయ్య’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.

ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘దేశోద్దారకుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.

కే.రాఘవేంద్రరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపూర్వ సహోదరులు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భార్గవరాముడు’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో బాలయ్య, విజయశాంతి హీరో,హీరోయిన్లుగా నటించిన ‘సాహస సామ్రాట్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ,విజయశాంతి హీరో,హీరోయిన్లుగా నటించిన ‘మువ్వగోపాలుడు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య, విజయశాంతి జోడిగా నటించిన ‘భానుమతిగారి మొగుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ, విజయశాంతి హీరో,హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.

ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ,విజయశాంతి హీరో,హీరోయిన్లుగా నటించిన ‘భలే దొంగ’ బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది.

భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ,విజయశాంతి నటించిన ‘ముద్దుల మావయ్య’ చిత్రం ఆల్ టైమ్ హిట్‌గా నిలిచింది.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య,విజయశాంతి నటించిన ‘ముద్దుల మేనల్లుడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.

బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ,విజయశాంతి జోడిగా నటించిన ‘లారీ డ్రైవర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.

తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘తల్లి దండ్రులు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.

బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య, విజయశాంతి హీరో,హీరోయిన్లుగా నటించిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.

ఏ.కోదండరామిరెడ్డి దర్శత్వంలో బాలకృష్ణ,విజయశాంతి హీరో,హీరోయిన్లుగా నటించిన చివరి చిత్రం ‘నిప్పురవ్వ’ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది.

విజయశాంతి, బాలయ్య, జోడిగా నటించిన చిత్రాలు 90 శాతం సక్సెస్ సాధించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here