Home movie news నాకు వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు, పూజ‌ల‌తో క‌రోనా దూరం.. ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ నిర్వాకం

నాకు వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు, పూజ‌ల‌తో క‌రోనా దూరం.. ఓ సీనియ‌ర్ యాక్ట‌ర్ నిర్వాకం

69
0

కరోనా వైరస్ సెకండ్ వేవ్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. వ్యాక్సినేషన్ అందుబాటులో ఉండటంతో అందరూ రెండు డోస్ లు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో సినీ ప్రముఖులు సైతం కరోనా వేళ జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్ తప్పకుండా ధరించాలని.. సామాజిక దూరం పాటించాలని చెబుతూ ఎవరికి తోచిన విధంగా వారు కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రచారం చేస్తున్నారు. అలానే కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి వ్యాక్సినేషన్ తీసుకునేలా ప్రజలల్లో చైతన్యం కల్పిస్తున్నారు. మన టాలీవుడ్ హీరోలు కొందరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడమే కాకుండా ఇతరులను టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే ఓ స్టార్ హీరో మాత్రం కొన్ని రోజుల ముందు వరకూ కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి ససేమిరా అన్నారట.

దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఓ సీనియర్ హీరో మాత్రం తనకు కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదని అన్నారట. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా దర్శకనిర్మాతలు.. హీరో మరియు చిత్ర యూనిట్ సేఫ్ట్ దృష్ట్యా అందరూ కరోనా టీకాలు తీసుకుంటే మంచిదని సూచించారట. అయితే సదరు హీరో మాత్రం తాను డైలీ యోగా – పూజలు చేస్తానని.. దీని వల్ల తనలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉందని.. వ్యాక్సిన్ అవసరం లేదని అన్నారట. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ హీరోనే సైలెంట్ గా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారట. కరోనా ముందు తనలోని వ్యాధినిరోధక శక్తి సరిపోదని ఇప్పుడు గ్రహించినట్లున్నాడు.. అందుకే వ్యాక్సిన్ తీసుకున్నాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా కరోనా వల్ల అంతా అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాబట్టి.. భవిష్యత్తు కోసం అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో అందరూ ఈ విషయాన్ని గ్రహించి బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here