రికార్డుల మోత మోగిస్తున్న అల్లు అర్జున్ పుష్ప‌ టీజ‌ర్‌

    284
    0

    అల్లుఅర్జున్‌ ‘పుష్ప’ ఇంట్రడక్షన్‌ వీడియో అత్యంత వేగంగా 60 మిలియన్‌ వ్యూస్‌ మార్క్‌ చేరుకుని టాలీవుడ్‌లో ఆల్‌ టైమ్‌ రికార్డు సృష్టించిందని చిత్ర బృందం మంగళవారం అధికారికంగా తెలిపింది.
    ‘ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు తెలుగు ఇండిస్టీలో ఉన్న ఇమేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర ఇండిస్టీల్లో కూడా తన మార్కెట్‌ని మరింత విస్తృతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘పుష్ప’ సినిమా మేకింగ్‌ దశలోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. బన్నీ, రష్మిక మందన జంటగా మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై అగ్ర దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి చెందిన ‘పుష్ప ఇంట్రడక్షన్‌’ వీడియో యూ ట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సష్టిస్తోంది. పుష్ప రాజ్‌ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలైన క్షణం నుంచి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకెళ్తోంది. టాలీవుడ్‌లో అత్యంత వేగంగా 60 మిలియన్‌ వ్యూస్‌ మార్క్‌ అందుకున్న తొలి ఇంట్రడక్షన్‌ వీడియోగా ఈ సినిమా చరిత్ర సష్టించింది. 1.4 మిల్లియన్‌ లైక్స్‌తో పాటు లక్షకు పైగా కామెంట్స్‌ కూడా ఈ వీడియోకు రావడం విశేషం. ఈ వీడియోలో దేవి శ్రీ ప్రసాద్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్‌ అయ్యింది. సినిమాకు సంబంధించిన మరిన్ని సర్‌ప్రైజింగ్‌ విశేషాలను త్వరలోనే మేకర్స్‌ తెలియజేయబోతున్నారు’ అని చిత్ర బృందం తెలిపింది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here