మ‌హేష్ త‌న 28వ సినిమా కోసం ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా..?

  235
  0

  టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు తన మార్కెట్ కి తగ్గట్లు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటారనే ప్ర‌చారం మ‌న‌కు తెలిసిందే. అయితే మహేష్ నిర్మాత‌గా మారిన తర్వాత ఇప్పుడు తాను నటించే సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉంటూ వస్తున్నారు. దీని కోసం నాన్ థియేట్రికల్ రైట్స్ తో పాటుగా ప్రతి సినిమాలో 20 శాతం లాభాల్లో వాటా తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకుంటారని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ‘శ్రీమంతుడు’ సినిమా మొదలుకొని ‘మహర్షి’ సినిమా వరకు మహేశ్ తన సినిమాలకి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ ని ఓ బాంబే మేనేజ్ మెంట్ ఏజెన్సీకి ఇచ్చేలా భారీ మొత్తానికి అగ్రీమెంట్ చేసుకున్నారట. అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఇలాంటి డీల్స్ చేసుకోవడం కుదరడం లేదట.

  అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేసే ‘#SSMB28’ సినిమాకి నాన్ థియేట్రికల్ రైట్స్ కాకుండా డైరెక్ట్ రెమ్యూనరేషన్ తీసుకునేలా మహేష్ ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇందుకు గాను మహేష్ బాబు కు దాదాపుగా 60 కోట్లు పారితోషికంగా అందుతోందని.. ఈ ప్రపోజల్ వెనుక డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్నారని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఈ విషయమై హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఇకపోతే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారని సమాచారం.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here