Home Entertainment నాగార్జున అడిగినా చెప్పని అరియానా అస‌లు పేరు ఏంటో తెలుసా..?

నాగార్జున అడిగినా చెప్పని అరియానా అస‌లు పేరు ఏంటో తెలుసా..?

67
0

బిగ్ బాస్ సుంద‌రి అరియానా గ్లోరీ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారనుకునే వాళ్లకు అరియానాను చూపిస్తే సరిపోతుంది. అయితే ఈమె అసలు పేరు అది కాదు. మరి అరియానా రియల్ నేమ్ ఏంటి..?
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగమ్మాయిలు అందాల ఆరబోతకు దూరంగా ఉంటారనుకునే వాళ్లకు అరియానాను చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే అంతగా రెచ్చిపోతుంది ఈ భామ.
బిగ్ బాస్ కంటే ముందు యూ ట్యూబ్‌లో బాగానే ఫేమస్ అయిపోయింది అరియానా. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అమ్మడు రేంజ్ మారిపోయింది. నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ ఆయన చేసిన కామెంట్స్‌తో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
తెలంగాణలోని తాండూరు నుంచి వచ్చిన ఈ భామ.. హైదరాబాద్ వచ్చి పడరాని కష్టాలన్నీ పడింది. ఆ తర్వాత ఎలాగోలా యూ ట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలతో ఫేమస్ అయింది. ఇప్పుడు ఏకంగా సెలబ్రిటీ అయిపోయింది. బిగ్ బాస్ పుణ్యమా అని అమ్మడు రేంజ్ కూడా పెరిగిపోయింది. అరియానా అంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా గుర్తు పట్టేస్తారు. అంత ఫేమస్ అయిపోయింది. పైగా అవినాష్‌తో ఈమె వ్యవహారం కూడా అరియానాను టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మార్చేసింది. అయితే అందరికీ అరియానాగానే తెలిసిన ఈమె ఒరిజినల్ నేమ్ మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.

బిగ్ బాస్ షోకి వచ్చినపుడు నాగార్జున కూడా నీ రియల్ నేమ్ ఏంటి అని అడిగారు. అయితే దానికి అరియానా సమాధానం చెప్పలేదు. తనకు అరియానా అనే పేరు మాత్రమే బాగుంటుందని.. పాత పేరును కనీసం గుర్తు కూడా పెట్టుకోలేదని చెప్పుకొచ్చింది. అయితే ఈమె రియల్ నేమ్ మంగలి అర్చన. ఈ పేరు చాలా మందికి తెలియదు.. అరియానా క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబీకులు తప్ప మరెవరూ కూడా ఈమెను అర్చన అని పిలవరు. ఆ పేరు ఉన్నపుడు పెద్దగా కలిసిరాలేదని.. అందుకే అరియానా గ్లోరీగా పేరు మార్చుకున్నానని చెప్పింది ఈమె. ఈ పేరు పెట్టుకున్న తర్వాత నిజంగానే తన కెరీర్ గ్లోరియెస్ అంటుంది అరియానా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here