Home Entertainment బెడ్ రూమ్ ఫోటో బ‌య‌ట‌పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ..

బెడ్ రూమ్ ఫోటో బ‌య‌ట‌పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ..

187
0

ప్రేమ పక్షులుగా సోషల్ మీడియాలో చెల‌రేగుతున్న‌ సెలబ్రిటీలు దీప్తి సునయన- షణ్ముఖ్ జస్వంత్ జోడీ పర్సనల్ ఫొటో ఒకటి తెగ వైర‌ల్ అవుతోంది. ఇందులో ఈ ఇద్దరూ ఒకే బెడ్‌పై కనిపించడంతో అంద‌రూ షాక‌వుతున్నారు.

డాన్స్ వీడియోలతో ఫేమస్ అయింది దీప్తి సునయన- షణ్ముఖ్ జస్వంత్ జోడీ. అయితే ఆ సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారని టాక్. అతనితో కలిసి వరుసగా కవర్ సాంగ్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న సమయంలోనే దీప్తి సునయనకు బిగ్ బాస్ సీజన్-2లో పాల్గొనే అవకాశం రావడంతో ఆమె పాపులారిటీ రెట్టింపయింది. అయితే బిగ్ బాస్ నుంచి బయటకొచ్చాక వీళ్లిద్దరూ కలిసి వీడియోలు చేయకపోవడంతో ఇద్దరూ బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు కూడా షికారు చేశాయి.

షణ్ముఖ్ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. ఇంతలో చాలా రోజుల తర్వాత దీప్తి సునయన- షణ్ముఖ్ జస్వంత్ జోడీ మళ్ళీ ఒక్కటై తెగ షికార్లు కొడుతున్నారు. పార్టీలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఆ పిక్స్ షేర్ చేస్తుండటంతో వీరిద్దరి లవ్ ట్రాక్ మళ్ళీ హాట్ టాపిక్ అయింది. సరిగ్గా ఈ తరుణంలో దీప్తి సునయన- షణ్ముఖ్ జస్వంత్ పర్సనల్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఇద్దరూ ఒకే బెడ్‌పై కనిపించడంతో అంతా షాక్ అయ్యారు.

బెడ్ మీద కూర్చొని షణ్ముఖ్ ఏదో తింటుండగా దీప్తి మాత్రం బెడ్‌పై పడుకుని కనిపించింది. ఈ ఫొటోను స్వయంగా దీప్తి తన సోషల్ మీడియా వాల్‌పై పోస్ట్ చేసింది. మరి ప్రేమ పక్షులు ఇలా ఒకే రూంలో, ఒకే బెడ్‌పై కనిపిస్తే జనం ఊరుకుంటారా.. వెంటనే ఈ పిక్ స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ చేసేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here