Home Entertainment నాగ‌చైత‌న్య థ్యాంక్యూ స్టోరీ లైన్ లీక్.. మ‌రో మ‌నం లాగా ఉండబోతుందా..!

నాగ‌చైత‌న్య థ్యాంక్యూ స్టోరీ లైన్ లీక్.. మ‌రో మ‌నం లాగా ఉండబోతుందా..!

114
0

నాగచైతన్య, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల ముంగిట నిలిచి పోయిన విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు. ఇక మరో వైపు చైతన్య ‘థ్యాంక్యూ’ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మనం దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న థ్యాంక్యూ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శకుడు విక్రమ్ కుమార్ కథలు అన్ని కూడా చాలా విభిన్నంగా స్క్రీన్ ప్లే బేస్డ్ గా సాగుతూ ఉంటాయి. సింపుల్ కథలను చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో విక్రమ్ నడిపిస్తూ ఉంటాడు. మనం లో మూడు జెనరేషన్ లను చూపించి మెప్పించిన విక్రమ్ కుమార్ థ్యాంక్యూలో కూడా కాస్త అటు ఇటుగా మరో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ ను చూపించబోతున్నాడట. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న పుకారు ప్రకారం ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇండియాలో తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను వెదికేందుకు జర్నీ మొదలు పెడతాడు. ఆ సమయంలో అతడు ఎదుర్కొన్న అనుభవాల సారాంశమే ఈ సినిమా అంటున్నారు.

మనం సినిమా లో పూర్వ జన్మ కాన్సెప్ట్ ను కాస్త కలిపిన దర్శకుడు విక్రమ్ ఈ సినిమా లో మాత్రం అలా కాకుండా తల్లిదండ్రులను వెదుకుతూ ఉండే ఒక కొడుకును చూపించాడు. నాగచైతన్యను మనం లో చాలా విభిన్నంగా ఆకట్టుకునే విధంగా చూపించిన దర్శకుడు థ్యాంక్యూ లో కూడా మంచి లుక్ తో లవర్ బాయ్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకు ఇటలీలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ఇటీవలే అక్కడ షెడ్యూల్ ను ముగించినట్లుగా సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా లో ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలో థ్యాంక్యూ పూర్తి వివరాలను త్వ‌ర‌లో వెళ్ళ‌డించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here