Home Featured కుర్ర‌కారును హీటెక్కిస్తున్న శృతి హాస‌న్‌

కుర్ర‌కారును హీటెక్కిస్తున్న శృతి హాస‌న్‌

144
0

View Post

ఫ్యాషన్స్ అండ్ ట్రెండ్స్ ని అనుసరించడంలో స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ తర్వాతే. ఈ భామలో వెస్ట్రన్ పోకడలు శ్రుతి మించుతున్నాయని ఇటీవల కామెంట్లు వినిపిస్తున్నా అవేవీ తనకు పట్టడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా శ్రుతి పోకడ పరిశీలిస్తే ఈ సంగతి ఇట్టే అర్థమవుతుంది. రకరకాల గజిబిజి పెయింటింగులు.. వెస్ట్రన్ వేర్ తో ఫోటోషూట్లు చివరకు వెస్ట్రన్ మూడ్ లో మాస్క్ ధారణ ఇవన్నీ చూస్తుంటే ఏమైపోతోందో అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఫ్యాన్స్.

అయితే వీటన్నిటికీ భిన్నంగా బాడీ ఫిట్ లుక్ తో తాజాగా కనిపించింది శ్రుతి. ఈ లుక్ లో సంథింగ్ స్పెషల్ గా హాట్ గా కనిపిస్తోందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ఇక కెరీర్ పరంగానూ శ్రుతి కంబ్యాక్ ఎదురే లేని సక్సెస్ తో కొనసాగుతోంది. ఇంత క్రైసిస్ లోనూ రెండు బ్లాక్ బస్టర్లతో రీలాంచ్ అయిన ఏకైక నటిగా శ్రుతి పేరు మార్మోగుతోంది.

రవితేజ సరసన నటించిన క్రాక్ ఏడాదిని ఘనంగా ప్రారంభిస్తే.. ఈ సమ్మర్ లో వచ్చిన వకీల్ సాబ్ తనని పూర్తిగా సక్సెస్ గ్రాఫ్ లో పైపైకి పట్టాలెక్కించింది. తదుపరి పలు క్రేజీ సినిమాలు క్యూలో ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ సరసన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ లోనూ శ్రుతి కథానాయికగా నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here