Home gossips ‘లూసీఫర్ ‘ అసలు దర్శకుడు ఎవరు?

‘లూసీఫర్ ‘ అసలు దర్శకుడు ఎవరు?

94
0

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి ప్రాజెక్ట్ను ధృవీకరించారు. సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ `లూసిఫెర్ ‘కు తెలుగు రీమేక్ చేయబోతున్నాడు. వచ్చే నెల 2021 జనవరిలో సంక్రాంతి తర్వాత సెట్స్‌లోకి రానున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు.

ఫిబ్ర‌వ‌రి-మార్చి – ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో ఈ 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక దర్శకుడి విషయానికి వస్తే… మోహ‌న్ రాజా ప్ర‌ఖ్యాత ఎడిట‌ర్ మోహ‌న్ వార‌సుడిగా సుప‌రిచితం. ఆయ‌న త‌మిళంలో పాపుల‌ర్ డైరెక్ట‌ర్. ఐదు తెలుగు సినిమాల్ని త‌మిళంలోకి రీమేక్ చేసి హిట్ సాధించారు ఆయన.

ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించిన `హిట్ల‌ర్` సినిమాకి ముత్యాల సుబ్బ‌య్య వ‌ద్ద మోహ‌న్ రాజా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు. ఆ రకంగా ఆయనకు గతంలోనే చిరంజీవి తో పరిచయం ఉందట. సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నారు. మిగతా విషయాలు జనవరిలో ప్రకటిస్తారు.

ఇది ఇలా ఉండగా… అసలు సినిమా స్క్రిప్ట్ కు పెద్దగా మార్పులు చెయ్యకూడదని మోహన్ రాజా నిర్ణయించుకున్నారని సమాచారం . కాబట్టి, చిరంజీవికి హీరోయిన్ ఉండదు. రొమాంటిక్ ట్రాక్ కూడా చేర్చబడదు. ఇది మెగా అభిమానులకు సరికొత్త ఎక్సపీరియెన్స్ అనే చెప్పుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here