Home gossips పెళ్లి తర్వాత తనకు ఎలాంటి ప్రణాళికలు లేవని టాప్ హీరోయిన్ చెప్పారు

పెళ్లి తర్వాత తనకు ఎలాంటి ప్రణాళికలు లేవని టాప్ హీరోయిన్ చెప్పారు

85
0

చాలా మంది హీరోయిన్లకు పెళ్లి చేసుకునే అవకాశం కూడా రాదు. అందుకే హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి ముందు ముందుకు వెనుకకు ఆలోచిస్తారు. కానీ సమంత ఏ వయసులో ముచ్చట ఆ వయసులోనే తీర్చుకోవాలంటూ చైతూని ప్రేమించి పెళ్లాడింది. అయినా సమంత క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. పెళ్లి తర్వాత క్రేజీ అవకాశాలతో దూసుకుపోతుంది. మరి సమంత కి ఇప్పటికీ సినిమా అవకాశాల జోరు ఏమాత్రం తగ్గలేదు. దానికి కారణం ప్రతిభ మాత్రమే కాదు.. కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటుంది సమంత. పెళ్లి తర్వాత కూడా వరస ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా అంటే దానికి కారణం అదృష్టమే అంటుంది సమంత.


అసలు హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే కెరీర్ పోతుంది, కెరీర్ కి పెళ్లి అడ్డంకి కాదని నిరూపించడానికి తాను పెళ్ళికి ముందు ప్లాన్స్ ఏమి చేసుకోలేదని, అందరిలా పెళ్లి తర్వాత తన కెరీర్ ముగిసిపోయింది అని, అవకాశాలు ఇక రావనే అనుకున్నాను అని అంటుంది. అందుకు సిద్దపడే చైతు తో పెళ్లి పీటలెక్కా అంటుంది సమంత. కాని అదృష్టం కొలది.. తనకి పెళ్లి తర్వాత మంచి ఆఫర్స్ వచ్చి రంగస్థలం, ఓ బేబీ, మహానటి, మజిలీ లాంటి మంచి సినిమాలు చేశా అంటుంది.ఇదంతా కేవలం అదృష్టం వలనే సాధ్యమైంది అంటూ కుండబద్దలు కొట్టింది అక్కినేని సమంత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here