Home Entertainment జగన్ కు అసలు నిజం అర్థమయిందట?

జగన్ కు అసలు నిజం అర్థమయిందట?

136
0

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు విషయం అర్థమయింది. పార్టీని నిర్లక్ష్యం చేస్తే తర్వాత పరిస్థితులు అదుపుతప్పుతాయని ఆయన గ్రహించినట్లున్నారు. అందుకే నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశమవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నియోజకవర్గాల వారీగా ముఖ్యనేతలతో జగన్ సమావేశం అవుతారని చెబుతున్నారు. దీనికి సంబంధించి నియోజకవర్గాల వారీగా వివరాలను రెడీ చేయాలని పార్టీ సీనియర్ నేతలను జగన్ ఆదేశించినట్లు తెలిసింది.

ఇప్పటి వరకూ…..

ముఖ్యమంత్రిగా జగన్ బిజీగా ఉన్నారు. ఆయన సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వీలయినంత ఎక్కువగా ప్రజలకు పథకాలను అందించడమే ఈ పదిహేను నెలలు పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు అన్ని పథకాలను గ్రౌండ్ చేసినట్లే. తాను పాదయాత్రలోనూ, మ్యానిఫేస్టోలోనూ ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశానని భావించిన జగన్ ఇప్పుడు పార్టీపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు.

నియోజకవర్గాల వారీగా…..

గత పదిహేను నెలలుగా పార్టీలో ఇష్టారాజ్యంగా తయారయింది. నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, మిగిలిన నేతలకు మధ్య పొసగడం లేదు. పార్టీ కార్యకర్తలు కూడా నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు. ఈ సంగతి జగన్ కు తెలిసినా ఇప్పటి వరకూ పెద్దగా పట్టించుకోలేదు. వాటంతట అవే సర్దుకుంటాయిలే అని అనుకున్నారు. సీనియర్ నేతలకు అప్పగించినా అవి సర్దుబాటు కాలేదు.

గ్రూపు విభేదాలకు…..

దీంతో జగన్ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు, కార్యకర్తలకు మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానం ఉంటుంది. ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా పిలుస్తారు. ఈ సమావేశాల్లో పూర్తి క్లారిటీని జగన్ ఇస్తారంటున్నారు. కొన్ని చోట్ల నెలకొన్న వర్గ విభేదాలకు కూడా ఈ సమావేశాలతో చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. అధికారంలో ఉండటంతో సహజమేనని భావించిన జగన్ రోజురోజుకూ విభేదాలు తీవ్రమవుతుండటం, రోడ్డున పడుతుండటంతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here