Home Entertainment మళ్లీ ఆమెకే ఛాన్స్ ఇస్తారా?

మళ్లీ ఆమెకే ఛాన్స్ ఇస్తారా?

279
0

తెలంగాణలో వరస ఎన్నికలు అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్ కు సవాల్ గా మారనుంది. ఇక త్వరలో మరో ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. నిజామాబాద్ కు చెందిన ఆకుల లలిత ఎమ్మెల్సీ పదవి కాలం మరికొద్ది నెలల్లోనే ముగియనుంది. మరో నాలుగైదు నెలల్లో ఈ ఎన్నిక జరగనుంది. అయితే ఇది ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నిక కావడంతో అధికార పార్టీ టీఆర్ఎస్ కే ఈ పదవి దక్కనుంది.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి….

ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఆకుల లలిత కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆకుల లలిత టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ లో చేరిన నాడే ఆమెకు మరోసారి అవకాశం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో పదవులను ఎక్కువగా ఇస్తున్నారు.

ఆ జిల్లాకు అనేక పదవులు…..

ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అదే ప్రాంతానికి చెందిన సురేష్ రెడ్డికి అవకాశం కల్పించారు. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన కుమార్తె కవితను కేసీఆర్ ఎంపిక చేశారు. అయితే ఆకుల లలిత కూడా అదే జిల్లాకు చెందిన వారు. మరోసారి ఆ జిల్లాకు పదవి దక్కుతుందనే ప్రచారం టీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఆకుల లలిత టీఆర్ఎస్ లో చేరడానికి అప్పట్లో మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగరరావు కృషి చేశారు. మరో టర్మ్ తనకు అవకాశం ఇస్తారన్న హామీతోనే ఆకుల లలిత టీఆర్ఎస్ లో చేరారంటున్నారు.

మరోసారి అవకాశం ఇవ్వాలని……

ఈసారి కూడా ఆకుల లలితకే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అవకాశం కల్పిస్తారన్న టాక్ ఉంది. ఎమ్మెల్యే కోటా కావడంతో ఈ ఎన్నిక కేవలం నామమాత్రమే అయినా ఆకుల లలిత తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేతను కోరనున్నట్లు తెలిసింది. ఆమె కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కోటాలో అనేక మంది పోటీ పడుతుండటంతో కేసీఆర్ మరోసారి ఆకుల లలితకు అవకాశం ఇస్తారా? లేదా? అన్న చర్చ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here