Home movie news ఆదిపురుష్‌లో మరో బాలీవుడ్ స్టార్?

ఆదిపురుష్‌లో మరో బాలీవుడ్ స్టార్?

153
0

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మొట్టమొదటి స్ట్రెయిట్ హిందీ చిత్రం ఆదిపురుష్ ఇటీవల ప్రకటించబడింది. అప్పటి నుండి మీడియాలో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రతిసారీ, ఈ చిత్రం గురించి అభిమానులలో ఉత్సాహం రేకెత్తించేలా ఏదో ఒక వార్త చెబుతుంది చిత్రబృందం.

టైటిల్ ఆగస్టులో ప్రకటించబడింది మరియు సెప్టెంబరులో, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పేరు ప్రధాన విలన్ గా ప్రకటించబడింది. ఈ నెల 23 న బృందం మరో నఅప్డేట్ ను ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గా ప్రకటించబోతోంది. అజయ్ దేవ్‌గన్ సినిమాలో నటించబోతున్నట్టు ప్రకటించనున్నట్లు మనకు ఉన్న సమాచారం.

అతను ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అని అంటున్నారు. పెద్ద బాలీవుడ్ స్టార్స్ తో ఈ చిత్రానికి బాలీవుడ్ లో క్రేజ్ ఎక్కువవుతుంది. అజయ్ దేవ్‌గన్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ – ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నమల్టీస్టారర్ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు.

ఈ చిత్రంలో భగత్ సింగ్ పాత్రలో ఆయన నటిస్తున్నట్లు పుకారు ఉంది. ఆదిపురుష్ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు వెళ్తుంది. 2022లో విడుదలకు చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. మరోవైపు… ఈ చిత్రంలోని హీరోయిన్ పై ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తుంది టీం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here