Home Entertainment లాక్ డౌన్ లోనూ…. లాక్ డౌన్ తరువాతా జోష్ ఇచ్చింది రాజమౌళినే

లాక్ డౌన్ లోనూ…. లాక్ డౌన్ తరువాతా జోష్ ఇచ్చింది రాజమౌళినే

93
0

ఆరు నెలలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్తబ్దుగా ఉంది. ఎంటర్టైన్మెంట్ లేకపోవడం… సొంత జీవితాలలోని ఇబ్బందుల వల్ల అందరి జీవితాల్లోనూ ఒకరకమైన నైరాశ్యం అలుముకుంది. లాక్ డౌన్ పెట్టిన కొత్తలో ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ టీజర్ తో రాజమౌళి సినీప్రియులకు కాసింత జోష్ ఇచ్చారు. తాజాగా మరోసారి అటువంటి డోస్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రేపు అభిమానులకు ఒక సర్ప్రైజ్ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించింది. దీనితో అభిమానులు ఒక్కసారిగా జోష్ లోకి వచ్చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోకు సంబంధించిన అప్డేట్ ఉంటుందని ఎక్సైటెడ్ గా ఉన్నారు.

మరోవైపు… అంతా కనుక్కున్నది అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ రెండో వారం వరకు నాన్ స్టాప్ గా హైదరాబాద్ లో షూటింగ్ జరపాలని రాజమౌళి భావిస్తున్నాడు. షూటింగ్ పూర్తి అయ్యేవరకూ సినిమాకు పని చేసే టెక్నీషియన్స్ కు బయటకు వచ్చే అవకాశం ఉండదు. డిసెంబర్ లో సినిమా విడుదల మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి 2020 కి విడుదల కావాల్సి ఉంది, అయితే ఈ పాండమిక్ విరామం కారణంగా ఈ చిత్రం నిరవధికంగా వాయిదా పడింది. అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి వారి పోరాటాలకు ముందు ఢిల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here